Upendra: ‘సీఎం కావాలనుంది..’ కోరిక బయటపెట్టిన స్టార్ హీరో..

upendra wish to be a cm
Share

Upendra: ఉపేంద్ర Upendra కు కన్నడలో మంచి ఇమేజ్ ఉంది. అక్కడ ఆయన స్టార్ హీరో. సినిమాలతోపాటు ఆయనకు రాజకీయాల్లోకి వెళ్లాలన్న బలీయమైన కోరిక ఉంది. ఈమేరకు 2017లో ‘కర్ణాట ప్రజ్ఞావంత జనతా పార్టీ’ని స్థాపించారు. కానీ.. పార్టీలో అసంతృప్తి రేగడంతో అనతికాలంలో సొంత పార్టీ నుంచే బయటకు వచ్చేసి ‘ప్రజాకీయ’ అనే పార్టీ పెట్టి 2018 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ.. పోటీ చేయలేదు. ఇప్పుడు ‘నాకు సీఎం కావాలని ఉంది.. ఎన్నికల్లో నుంచుంటే మీరు నన్ను ఎన్నుకుంటారా?’ అని కర్ణాటక ప్రజలను ఉద్దేశించి ఓ లెటర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ అయింది.

upendra wish to be a cm
upendra wish to be a cm

కన్నడిగులకు లేఖ రాస్తూ.. ఆయన తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. సమకాలీన రాజకీయాల్లో ‘ప్రజాకీయ’ ద్వారా సేవా చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే అవసరమైన ప్రజలకు సాయం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సీఎం (కామన్ మేన్) అనే పదానికి మాత్రం ఖచ్చతిమైన అర్ధాన్నిస్తానని చెప్పుకొచ్చారు. ప్రజల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికీ జవాబుదారీ అవుతానన్నారు. కర్ణాటకను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అనునిత్యం కష్టపడతానన్నారు. ప్రజలు నన్ను  ఎన్నుకుంటారో లేదో తెలీదు.. కానీ.. నేను ఎన్నికల్లో మాత్రం నిలబడను? అన్నారు. అధికారపక్షాన్ని, విపక్షాన్ని కూడా వారి వైఫల్యాలపై ప్రశ్నిస్తాను. రాజకీయంలో లీడర్లు ఉంటారు. ప్రజాకీయలో ప్రజా సేవకులు మాత్రమే ఉంటారు. వారు మీకు నచ్చకపోయినా.. వెళ్లిపోయినా మీకు నేను అండగా ఉంటాను. ఉత్తమమైన కామన్ మేన్ గా ఉంటాను.

ఇందుకు సిస్టమ్ మార్చాల్సిన అవసరం ఉంది. అంతవరకూ శక్తివంతమైన మీతో కామన్ మేన్ గా మీలో ఒకడిగా ఉంటాను.. అంటూ ఓ సుదీర్ఘ లేఖ రాశారు. ప్రస్తుతం ఉపేంద్ర తెలుగులో గని సినిమాలో నటిస్తున్నారు. నేటి జనరేషన్ కు తగ్గ కథలతో ఆయన రెండు దశాబ్దాల క్రితమే ఉపేంద్ర, ఏ.. వంటి విభిన్న కథలను తెరకెక్కించి ప్రేక్షకాదరణ చూరగొన్నారు. పలు తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో కూడా హీరోగా నటించారు. తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే.. రాజకీయాల్లో రాణించాలనే ఆయన కోరిక ఇంకా నెరవేర లేదు. మరి వచ్చే ఎన్నికలకైనా ఆయన పోటీ చేస్తారో లేదో చూడాలి.


Share

Related posts

జగన్ – పీకే మీటింగ్ గుట్టు ఇదే..! కేటీఆర్ తో కూడా కీలక చర్చలు..!?

Srinivas Manem

బిగ్ బాస్ 4 : హారిక లోపల ఉంటే… ఆమె అన్న, అమ్మ ఏం చేశారో చూడండి..! ఎమోషనల్ అయిపోయిన హారిక

arun kanna

సంఖ్యశాస్త్రం ప్రకారం ప్రమాదకరమైన నంబర్స్ ఇవే!!

Kumar