NewsOrbit
న్యూస్

UPI payments: డిజిటల్ చెల్లింపుల కోసం కొత్త ఫీచర్.. ఇంటర్ నెట్ లేకుండానే..

Digital payments: ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటం కామన్. ఇక చాలా మంది పాకెట్ లో డబ్బులు పెట్టుకోవడం చాలా వరకు మానేశారు. ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో ఏది కొనుగోలు చేసినా డిజిటల్ చెల్లింపులకే ప్రియారిటీ ఇస్తున్నారు. చిన్న కిరాణం షాప్ మొదలుకుని ఎక్కువగా యూపీఐ పేమెంట్స్ చేయడానికి అలవాటు పడ్డారు. ఇలా డిజిటల్, యూపీఐ చెల్లింపులను పెంచేందుకు ఆర్బీఐ కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిన పలు ఇంట్రస్టింగ్ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ ఇటీవలే మీడియాకు సైతం వెల్లడించారు. మరి అవేంటో తెలుసుకుందాం..

 

ఫీచర్ ఫోన్స్‌లో

 

ఫీచర్ ఫోన్లల్లో ఇంటర్ నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపుల సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత‌దాస్. తాజాగా మీడియాతో మాట్లాడని ఆయన.. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వచ్చే రోజుల్లో యూపీఐ (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్) ఆధారిత ఉత్పత్తులను ఫీచర్ ఫోన్స్‌లో అందుబాటులోనికి తెస్తామని ప్రకటించారు. ఆర్బీఐ ప్రకటనలో తెలియజేసిన వివరాల ప్రకారం.. చిన్న మొత్తాలకు సంబంధించిన పేమెంట్స్ ప్రక్రియను ఈజీగా మార్చేందుకు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు.

 

యూపీఐ పేమెంట్స్ పెంచడానికి ప్రయత్నాలు

 

యూపీఐ చెల్లింపులకు జనాల్లో ఆదరణ పెరగాలనే లక్ష్యంతోనే ఫీచర్ ఫోన్‌ల ఆధారంగా పేమెంట్స్ కు చాన్స్ కల్పించనున్నారు. ఐపీఓ ఆఫరింగ్ అప్లికేషన్స్‌కు యూపీఐ పేమెంట్స్ లిమిట్ ను రెండు లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచనున్నారు. వాలెట్స్, కార్ట్స్, యూపీఐ ద్వారా చెల్లింపుల్లో వసూళ్లు చేసే చార్జెస్ పై డిస్కషన్ పేపర్ ను రిలీజ్ చేయనున్నట్టు శక్తికాంత దాస్ వెల్లడించారు. మరి ఇంటర్ నెట్ అవసరం లేకుండానే యూపీఐ చెల్లింపుల ఫీచర్ కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. దీని వల్ల డిజిటల్ పేమెంట్ మరింతగా పెరిగే చాన్స్ ఉంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N