UPI: ఇకపై యూపీఐ పెమెంట్స్ పై ట్రాన్సాక్షన్ ఛార్జీలు చెల్లించాలి అనే వదంతుల నమ్మకండి. తప్పుడు హెడ్లైన్లు పెట్టి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎమ్ లాంటి యూపీఐ పెమెంట్స్ వాడే వారిని కంగారు పెడుతూ వొచ్చిన ‘పెమెంట్స్ పై ఛార్జీలు చెల్లించాలి’ అనే వార్తల్లో నిజం లేదు. మార్చ్ 24న NPCI పంపిన సర్క్యులర్ లో సూచించిన యూపీఐ పెమెంట్స్ పై 1.1% ఛార్జీలు ఎవరికీ వర్తిస్తాయి? ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI) అంటే ఏమిటి? సాధారణ యూజర్స్ కి ఈ ఛార్జీలు ఎందుకు వర్తించవు? అసలు విషయం ఏమిటో పూర్తి వివరాలతో ఇక్కడ తెలుసుకోండి.
నేషనల్ పెమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (NPCI) ఇటీవల యూపీఐ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ మర్చంట్ ట్రాన్సాక్షన్ పై 1.1% ఇంటర్ చేంజ్ ఫీ (మార్పిడి రుసుము) అమలు చేస్తూ ఒక సర్కులర్ విడుదల చేసినట్లుగా సమాచారం వొచ్చింది, అయితే ఈ సర్కులర్ మాత్రం ఇంకా పబ్లిక్ డొమైన్ లోకి రాలేదు.
తాజాగా విడుదలైన ఈ సర్కులర్ ప్రకారం ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్-PPI (Prepaid Payment Instruments) ఉపయోగించుకొని జరిగే వ్యాపారి లావాదేవీల పై (Merchant Transactions) 1.1% ఛార్జీలు చెల్లించాలి అని యూపీఐ పెమెంట్స్ అగ్గ్రిగేటర్లకు NPCI సూచించింది. కొత్తగా పెరిగిన ఈ ఛార్జీలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వొస్తున్నట్లు గా పెమెంట్స్ కార్పొరేషన్ పేర్కొంది. అయితే ఈ PPI ఛార్జీలు కేవలం 2000 రూపాయల పైన జరిగే లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది అని NPCI ప్రకటించటం గమనార్హం.
నేషనల్ పెమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా సర్కులర్ సాధారణ UPI యూపీఐ పెమెంట్స్ కు వర్తించదు
అయితే చాలా ఆన్లైన్ వార్తా పత్రికలు మరియు సోషల్ మీడియా వదంతులు NPCI సర్కులర్ ని అడ్డు పెట్టుకొని తప్పుడు హెడ్లైన్స్ ఇస్తూ రోజువారీ లావాదేవీలకు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎమ్ లాంటి యూపీఐ యాప్స్ వాడే వినియోగదారులను కంగారు పెడుతున్నాయి. అయితే NPCI సర్కులర్ ని క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే కొత్తగా పెరిగిన ఛార్జీలు సాధారణంగా బ్యాంకు ఖాతాకు బ్యాంకు ఖాతాకు మధ్య జరిగే UPI యూపీఐ ట్రాన్సక్షన్స్ కి వర్తించదు. 1.1% ఛార్జీలు కేవలం ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI) లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది.

ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ మర్చంట్ లావాదేవీల ఛార్జీలు కస్టమర్స్ కి వర్తించవు
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్(PPI) అంటే ఫోన్ పే, పేటీఎమ్ లాంటి పెమెంట్స్ యాప్స్ కలిపించే వాలెట్(Wallet) సదుపాయాలు. NPCI సర్కులర్ ప్రకారం ఇలాంటి వాలెట్స్ లో నగదు డిపాజిట్ చేసుకునేందుకు UPI బ్యాంకు ట్రాన్స్ఫర్ సదుపాయం ధ్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ కి 15 బేసిస్ పాయింట్లు వరకు వాలెట్ ని జారీ చేసిన సంస్థ బ్యాంకు కు ఛార్జీలు చెల్లించాలి. 1.1% వరకు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ మర్చంట్ ట్రాన్సాక్షన్ చార్జీలు ఏప్రిల్ 1 నుండి అమలు కానుంది. ఈ చార్జీలు కస్టమర్స్ కి వర్తించవు. దీని గురించి పూర్తి స్పష్టీకరణ ఇస్తూ NPCI బుధవారం ప్రకటన ఇచ్చింది.
సులభమైన భాషలో చెప్పాలంటే, ఎవరైనా కస్టమర్ 2000 రూపాయలకు మించి వాలెట్ లో నగదు డిపాజిట్ చేసుకున్నప్పుడు ఆ వాలెట్ ని జారీ చేసిన సంస్థ బ్యాంకు కు ఛార్జీలు చెల్లించాలి.
NPCI Press Release: UPI is free, fast, secure and seamless
Every month, over 8 billion transactions are processed free for customers and merchants using bank-accounts@EconomicTimes @FinancialXpress @businessline @bsindia @livemint @moneycontrolcom @timesofindia @dilipasbe pic.twitter.com/VpsdUt5u7U— NPCI (@NPCI_NPCI) March 29, 2023
ఇటీవల వాల్లెట్స్ ను UPI వ్యవస్థకు అనుసంధానిస్తూ వాలెట్ నుంచి UPI ట్రాన్సాక్షన్స్ కి NPCI అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే, ఇందులో భాగంగానే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ మర్చంట్ లావాదేవీల ఛార్జీలను వసూలు చేయనున్నట్లు నేషనల్ పెమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది. ఈ మార్పులతో ఇకనుంచి కస్టమర్లు బ్యాంకు మాత్రమే కాకుండా వాలెట్ ఉపయోగించుకొని కూడా UPI ట్రాన్స్ఫర్ చేసుకోవొచ్చు.
About Author: Deepak Rajula
Deepak Rajula is a post-graduate in Mass Communication with specialization in Print Journalism and New Media. He has over 4 years of experience in New media communications and working with NewsOrbit for past 1 year. To contact the author write to [email protected], for any queries write to us at [email protected] or [email protected].