Uppena : మెగా ఫ్యామిలీ నుండి ‘ఉప్పెన’ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే స్టార్ హీరో రేంజ్ వసూళ్ళు రాబడుతున్నాడు. ఉప్పెన భారీ చిత్రం కాకపోయినా పాటలు తో వచ్చిన హైప్ తో పాటు టాక్ కూడా బాగా ఉండడంతో ఓపెనింగ్స్ ఊహించని స్థాయిలో వచ్చాయి. అయితే ఆ తర్వాత వారంలో మూడు సినిమాలు రిలీజ్ ఉన్నందువల్ల ఈ సినిమా వారాల పై వారాలు ఆడుతుందని అంచనాలు అయితే ఎవరికీ లేవు.
అయితే అందరికీ షాక్ ఇచ్చేలా ఈ చిత్రం తొలి వారాంతంలో టాక్ తో సంబంధం లేకుండా హౌస్‌ఫుల్ సాధిస్తుంది. నాంది, కపటధారి, చక్ర సినిమాల్లో అసలు సందడి కనిపించడం లేదు. మిగతా రెండింటితో పోలిస్తే నాంది చిత్రానికి ఉన్నంతలో మెరుగైన వసూళ్ళు వస్తున్నాయి. అయితే ఆ చిత్రానికి పడాల్సిన హౌస్‌ఫుల్స్ ఉప్పెన కి పడుతున్నాయి అని ట్రేడ్ వర్గాల సమాచారం.
కపటధారి పరిస్థితి అయితే మరీ దయనీయం. చక్ర సినిమా ఒక మోస్తరుగా ఉంది. 100% ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాత ఈ మూడు చిత్రాలు ఖచ్చితంగా లాభాలు సాధిస్తాయని అంతా అనుకున్నారు. నాంది కి మంచి మౌత్ టాక్ సంపాదించింది. కపటధారి కన్నడలో సూపర్ హిట్ సినిమా కి రీమేక్. చక్ర మంచి థ్రిల్లర్ సినిమా. అయితే ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్లకు ఈ ఉప్పెన సినిమా వల్ల బ్రేక్-ఈవెన్ అవుతుందా లేదా అనే అనుమానాలు ఎక్కువయ్యాయి.
ఉప్పెన కు శనివారం, ఆదివారం అయితే ఫస్ట్ షో లు అన్ని హౌస్ ఫుల్ అయిపోయాయి. ఆదివారం కూడా ప్యాకెట్ మ్యాట్నీ, ఫస్ట్ షో హౌస్ ఫ్లుల్స్ తో సినిమా నడుస్తుంది. ఇక మిగిలిన మెగా హీరోల లాగా వైష్ణవ తేజ్ కూడా తన చిత్రానికి ఎదురు వచ్చిన అన్ని చిన్న సినిమాలను తొక్కేస్తుంటే మెగా అభిమానులు హాయిగా వేడుక చూసినట్లు చూస్తున్నారు.