Uppena : ఉప్పెన సినిమాతో కృతి శెట్టి టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా డెబ్యూ సినిమా కావడం తో ప్రమోషన్స్ కూడా మెగా రేంజ్ లో చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఈ సినిమా స్టాటస్ ఏంటో అని మెగా అభిమానులు తెగ ఆతృత పడ్డారు. ఎట్టకేలకి ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందు రాబోతుండటం తో ఎంత వీలైతే అంత ప్రమోషన్స్ ని చేస్తూ ఉప్పెన సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ని కలిగిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కాబట్టి సాధారణంగానే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
ఆ అంచనాలను అందుకునేందుకు మేకర్స్ బాగా ట్రై చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ – మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఇక రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఆడియో సినిమాకి హైలెట్ కాబోతుందని ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎప్పుడో రిలీజైన నీ కన్ను నీలి సముద్రం అన్న సాంగ్ ప్రూవ్ చేసింది. ఇన్నాళ్ళు ఈ లిరికల్ సాంగ్ యూత్ ని బాగా ఆకట్టుకొని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. కాగా తాజాగా నీ కన్ను నీలి సముద్రం వీడీయో సాంగ్ రిలీజ్ చేశారు.
Uppena : ఉప్పెన లో కృతి శెట్టి క్యూట్ లుక్స్ తో ఎంత అందంగా ఉందో…!
ఉప్పెన సినిమా ఈ నెల 12 న రిలీజ్ కాబోతున్న క్రమంలో మేకర్స్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరిపారు. ఈ ఈవెంట్ లో నీ కన్ను నీలి సముద్రం వీడియో సాంగ్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టి యూత్ తో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. క్యూట్ లుక్స్ తో కృతి శెట్టి ఎంత అందంగా ఉందో అని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఖచ్చితంగా కృతి శెట్టి ఉప్పెన సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈ బ్యూటి ఎంతవరకు సినిమాలో ఆకట్టుకుంటుందో. ఇక ఇప్పటికే కృతిశెట్టి కి పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వస్తున్నాయి.