Uppena movie Record : నీ కళ్ళు నీలి సముద్రం.. జల జల జలపాతం నువ్వు.. అంటూ వినసొంపైన పాటలతో కుర్రకారు గుండెలను ధక్ ధక్ కనిపించిన ఉప్పెన.. మరి బాక్సాఫీస్ రికార్డులను ధక్ ధక్ అనిపిస్తోందా అన్న ఆలోచనలకు పులిస్టాప్ పెట్టేసింది.. కేవలం ఒకే ఒక్క రోజులో వరల్డ్ వైడ్ గా రూ.10.42 కోట్ల షేర్ రాబట్టింది..
షేర్ పూర్తి వివరాలు ఇలా..
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొత్తం రూ.10.42 కోట్లు.. ఇందులో నైజాం+ ఏపీ రూ. 9.3 కోట్లు..
* నైజాం రూ. 3.08 కోట్లు
* వైజాగ్ రూ.1.43 కోట్లు
* ఈస్ట్ రూ.0.98 కోట్లు
*వేస్ట్ రూ.0.81 కోట్లు
*కృష్ణ రూ.0.62 కోట్లు
* గుంటూరు రూ.0.75 కోట్లు
* నెల్లూరు రూ.0.35 కోట్లు
*టోటల్ ఆంధ్ర రూ.4.87 కోట్లు
*సీడెడ్ రూ 1.35 కోట్లు
*నైజాం + ఏపీ రూ 9.3 కోట్లు
ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తొలి రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఇక శని ఆదివారాలు రావడంతో పాటు వాలెంటైన్స్ డే కూడా ఉండడంతో ప్రేమికులు ఉప్పెన చిత్రానికి క్యూ కట్టే అవకాశం లేకపోలేదు. పైగా మాస్ ఆడియన్స్ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. దీంతో కలెక్షన్స్ ఊపందుకోవడం కాయం అనిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవి తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. తొలిరోజే బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి వీరందరూ కృషి ఎంతగానో ఉంది. ఇండియాలో ఇంతవరకు ఎవరు కొట్టలేని రికార్డు ను ఉప్పెన సొంతం చేసుకుంది..