Uppena: మెగా కాంపౌండ్ లో మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరో సాయిధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ తేజ్. ఉప్పెన సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి తేజ్.. మొదటి సినిమాతోనే తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ సీనియర్ హీరోల మాదిరిగా చూపించటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రేమకథా నేపథ్యంలో బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఈ ప్రేమ కథా చిత్రానికి యూత్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మొదటి సినిమాతోనే బీభత్సమైన క్రేజ్ వైష్ణవ తేజ్ సంపాదించుకోవడం జరిగింది. దీంతో ఇండస్ట్రీలో భారీ అవకాశాలు అందుకుంటున్న వైష్ణవ తేజ్.. తాజాగా ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ఒప్పుకొన్నాట్లూ టాక్ వినిపిస్తోంది. సంతోషం మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమా లను తెరకెక్కించిన డైరెక్టర్ దశరద్.. ఈ సినిమా కి స్టోరీ అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read more: Uppena : బుల్లితెర మీద షాకిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు..!
ఇదిలా ఉంటే ప్రస్తుతం సురేందర్ రెడ్డి.. అక్కినేని అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా చేస్తున్నారు. చాలా డిఫరెంట్ యాంగిల్ లో.. అఖిల్ ని ఈ సినిమాలో చూపించ నున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన అఖిల్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా అఖిల్ సినిమా అయిన వెంటనే వైష్ణవ్ తేజ్ ప్రాజెక్ట్ సురేందర్ రెడ్డి మొదలు పెట్టనున్నట్లు టాక్. ప్రస్తుతం వైష్ణవ తేజ్ అన్నపూర్ణ బ్యానర్లో రెండో సినిమా చేస్తున్నారు.