Uppena : ఉప్పెన సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమా అయిపోయింది. చిన్న సినిమా అయినప్పటికి ఏ ముహూర్తాన ఉప్పెన అని టైటిల్ పెట్టారో గాని ఉప్పెన మాదిరిగానే సినిమాకి క్రేజ్ ఏర్పడింది. మెగా మేనల్లుడు లాంఛ్ అవుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉంది. వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా కాబట్టి మెగా అభిమానులు మాత్రమే కాదు ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు మీద.. సుకుమార్ మీద, నిర్మాణ సంస్థ మీద అందరు గొప్పగా మాట్లాడుకుంటున్నారు.
ఇక హీరోయిన్ గా నటించిన క్యూటీ కృతి శెట్టి అయితే సినిమా రిలీజ్ కాకుండానే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఇప్పటికే రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని కి జంటగా ఒక సినిమా .. సుధీర్ బాబు కి జంటగా ఒక సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతేకాదు మరో రెండు రోజుల్లో ఉప్పెన రిలీజ్ కాబోతుండగా ఈ ఏడాది చివరకి వరకు నాని తో నటిస్తున్న శ్యాం సింగ్ రాయ్, సుధీర్ బాబు సినిమా రిలీజ్ కానున్నాయి. ఈ లెక్కన చూస్తే ఈ ఏడాది ఉప్పెన బ్యూటి నటించిన మూడు సినిమాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర పోషించిన విజయ్ సేతుపతి కూడా బాగా ప్రచారంలో నిలుస్తున్నాడు.
Uppena : మెగాస్టార్ ఈ పాత్రకి విజయ్ సేతుపతిని తప్ప మరెవరినీ తీసుకోవద్దని చెప్పారట.
అందుకు ఉదాహరణ ఈ సినిమాలో విజయ్ సేతుపతికి డబ్బింగ్ చెప్పిన బొమ్మాళి రవిశంకర్ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమా కమిటయినప్పుడే తన వాయిస్ సూటవదని విజయ్ సేతుపతి బుచ్చిబాబు కి చెప్పాడట. దాంతో బొమ్మాళి రవిశంకర్ తో చెప్పించారట. అయితే గతకొంతకాలంగా ఇలాంటి క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పలేదని బొమ్మాళి రవిశంకర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఎలాంట్ క్యారెక్టర్ అయినా ఒక్కరోజులో డబ్బింగ్ పూర్తి చేసే బొమ్మాళి రవిశంకర్.. ఈ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ కి మాత్రం మూడు రోజులు చెప్పాడట. అంత అద్భుతంగా విజయ్ పాత్ర ఉంటుందని ఈ కారణంగానే మెగాస్టార్ కూడా ఈ పాత్రకి విజయ్ సేతుపతిని తప్ప మరెవరినీ తీసుకోవద్దని చెప్పారట.