Sunil: మన తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది హాస్యనటులుగా తెలుగు తెరకు పరిచయమయ్యి ప్రేక్షకుల మన్ననలను పొందారు. ఏ సినిమా అయినా అందులో కచ్చితంగా ఓ హాస్య నటుడు మాత్రం ఉండాలిసిందే. ఇలా హాస్యనటుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యి ఆనతికాలం లోనే సునీల్ Sunil టాప్ కమెడియన్ గా పేరుగాంచాడు. సునీల్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యి ఇప్పటికే మూడు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా సునీల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి.
సునీల్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సునీల్ మొదట విలన్ అవ్వాలని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడట. కానీ సునీల్ కామెడీ టైమింగ్ ను అలాగే తన సెన్స్ అఫ్ హ్యూమర్ ని చూసి దర్శకులు, సునీల్ ని కమెడియన్ గా ఇండస్ట్రీ కి పరిచయం చేశారట. అలా అప్పటిలో కమెడియన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యి అతి తక్కువ కాలంలోనే నంది అవార్డులు లను కైవసం చేసుకున్నారు. ఇలా కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుని ఆ తరువాత హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించాడు సునీల్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన “కలర్ ఫోటో” సినిమా ద్వారా విలన్ అవ్వాలనే తన కోరికను కూడా తీర్చుకుని తన నటనకు గాను ప్రశంసలు అందుకున్నాడు.
ఇక సునీల్ మొదటిలో సినిమాలో అవకాశం కోసం ఎన్నో కష్టాలు పడ్డారట. అంతేకాకుండా తన సినీ ప్రయాణ ఆరంభంలో కూడా కనీసం వేతనం లేకుండా కొన్ని సినిమాలకు పని చేసాడట. ఇలా ఎన్నో కష్టాలను అధిగమించి ఇపుడు తెలుగు సినీ ఇండస్ట్రీ లో టాప్ లో నిలిచాడు. ప్రస్తుతం సునీల్ ఒక సినిమాలో హీరోగా నటించడానికి దాదాపుగా రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.