Urvasi routhela : ఊర్వశి రౌతెలా ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్. హాట్ హాట్ అందాలతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ ని సంపాదించుకుంది. సనం రే సినిమా ఊర్వశి కి మంచి క్రేజ్ తీసుకు వచ్చింది. ఇప్పుడు తెలుగులోనూ అడుగుపెట్టింది. సంపత్ నంది పర్యవేక్షణలో బ్లాక్ రోస్ అన్న సినిమా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘నా తప్పు ఏమున్నదబ్బా’ అన్న సాంగ్ బాగా ట్రెండ్ అయింది. టాలీవుడ్ లో డెబ్యూ సినిమాతో రాబోతున్న ఊర్వశి కోసం ఇక్కడ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తెలుగులో హీరోయిన్ గా నటించిన ఊర్వశి.. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప లోనూ ఒక ప్సెషల్ సాంగ్ చేస్తున్నట్టు వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. కాగా తాజాగా ఈ సాంగ్ లో ఊర్వశి అల్లు అర్జు తో కలిసి స్టెప్పులేయనుందట. ఈసాంగ్ కోసం భారీగా రెమ్యూనరేషన్ కూడా ముట్టచెప్పనున్నట్టు తెలుస్తోంది. ఇక రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడంటే ఆ సినిమాలో ఉండే స్పెషల్ సాంగ్ ఖచ్చితంగా స్పెషల్ అట్రాక్షన్స్ గా నిలిస్తుంది.
Urvasi routhela : ఊర్వశి అందాల విందు అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో..?
ఇప్పటికే సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలోని స్పెషల్ సాంగ్స్ అదిరిపోయాయి. ఇప్పుడు పుష్ప సినిమాలో ఈ సాంగ్స్ అన్నిటిని మించేలా దేవీశ్రీ ప్రసాద్ మాంచి ఊపున్న సాంగ్స్ ని ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాలో ఊర్వశి అందాల విందు అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎర్ర చందనం సంగ్లింగ్ నేపథ్యంలో భారీ పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతోంది. ఆగస్టు 13న భారీ స్థాయిలో ఈసినిమా రిలీజ్ కాబోతోంది.