వామ్మో.. రూ.2 లక్షల 20వేల రూపాయిలు టిప్పా.. ?

ఒకప్పుడూ వీక్లీకి ఒక్కసారైనా అలా ఫ్రెండ్స్ తో కలిసి పబ్ లకు, రెస్టారెంట్లకు వెళ్లి అలా చల్లగా ఒక బీరును వేసి ఆ క్షణాన్ని ఆస్వాదించేవారు. కాని నేడు పరిస్థితులన్నీ పూర్తిగా మారాయి. అసలు కొన్ని రోజుల కిందట బీరు రూపమే కనిపించలేదు. దాంతో అటు బీరు ప్రియుడు, బీర్లను పెట్టుకున్న వ్యాపారులు పూర్తిగా అసంతృప్తికి గురయ్యారు. కరోనా నియంత్రణలో భాగంగా అన్ని దేశాలు ఇలాంటి చర్యలు తీసుకున్నాయి. అయితే గత కొంత కాలంగా కరోనా కొంచెం అదుపులోకి రావడంతో మళ్లీ అన్నింటినీ రీ ఓపెన్ చేశారు. దాంతో ఇంకేముంది బీరు, క్వర్టర్ చుక్కలు గొంతులోకి దిగక ఎంతో మంది తమ నోళ్లను పస్తులుంచడంతో బీరులకు కోసం బారులు తీరారు. దాంతో కరోనా నియంత్రణ చర్యలను పూర్తిగా విస్మరించేశారు.

ఎన్ని ఆంక్షలు విధించినా మనుషుల్లో మాత్రం మార్పురావడం లేదు. అందుకే కొన్ని దేశాల్లో మళ్లీ అన్నింటినీ మూసేందుకు చర్యలు తీసుకోబోతున్నారట. ఇదిలా ఉంటే ఆ రెస్టారెంట్ కు కు అదే చివరి రోజు. ఎంతో బాధలో ఉన్న ఆ ఆ రెస్టారెంట్ కు ఓ కస్టమర్ తన దయా హృదయాన్ని చాటుకున్నారు. అందేటంటారా.. ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఓ ఆ రెస్టారెంట్ కు చేరుకున్నాడు. అక్కడ అతను కేవలం ఒకే ఒక్క బీర్ తాగి భారీ మొత్తంలో టిప్ ఇచ్చాడు. ఇంకేముంది ఆ టిప్ ను చూసి అనుకోకుండా ఇచ్చారా మీరు అని ఆ రెస్టారెంట్ యాజమాని అడగగా లేదు కావాలనే ఇచ్చానని సమాధానం చెప్పాడు. వామ్మో ఇంతనా అని కళ్లు తేలేసాడు ఆ యాజమాని హరి అదెంతో తెలుసా అక్షరాల 3000 డాలర్లట…

వామ్మో ఇంతనా అనుకుంటున్నారా అవును అది నిజమే.. వివరాల్లోకి వెలితే.. అమెరికాలోని ఓహియోలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తుండటంతో రెస్టారెంట్లను మూసివేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారట. అయితే బ్రెండన్ రింగ్ అనే ఓ వ్యక్తి అక్కడ 2001 నుంచి నైట్ టౌన్ పేరిట రెస్టారెంట్ ను నడుపుతున్నాడట. ఈ కరోనా మహమ్మారి కారణంగా అతను పూర్తిగా నష్టాల పాలు కావడంతో రెస్టారెంట్ ను మూసివేయాలని భావించాడట. ఇదిలా ఉంటే సోమవారం నుంచి కరోనా వ్యాప్తి తగ్గేవరకు రెస్టారెంట్లను తెరవొద్దని అనుకున్నాడట. అదే చివరి రోజున్న మాట. అదే రోజున తరచుగా ఆ రెస్టారెంట్ కు వెళ్లే ఓ యువకుడు తన కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లాడు. అందులో ఆ యువకుడు బీర్ ను తాగాడు.

బిల్లు పే చేసేందుకు ఆ యువకుడు ఆ రెస్టారెంట్ ఓనర్ కు క్రెడిట్ కార్డునిచ్చాడు. బీర్ బిల్లు 7 డాలర్లు అయ్యింది. అయితే ఆ కస్టమర్ 7 డాలర్లతో పాటుగా అదనంగా 3000 డాలర్లు స్వైప్ చేశాడట. అది చూసుకున్న ఆ రెస్టారెంట్ యాజమాని ఆ అమౌంట్ ను చూసి కళ్లు తేలేషాడట. దాంతో పరుగోపరుగందుకొని ఆ కస్టమర్ ను చేరుకుని మీరేంచేశారు.. అసలు అంత అమౌంట్ ఎందుకని ప్రశ్నించగా.. ఆ కస్టమర్ 3 వేల డాలర్లను టిప్ ఇస్తున్నానని దాన్ని మీ స్టాఫ్ అందరికీ సమానంగా ఇవ్వమని చెప్పాడట. దాంతో ఆ రెస్టారెంట్ యాజమాని ఫుల్ కుషీగా ఫీల్ అయ్యాడట. ఇలాంటి మనసున్న వారు కూడా ఉంటారా అని ఆ కస్టమర్ కు థాంక్స్ చెప్పాడట.