అమెరికాలో ఉండటం గొప్ప కాదు.. అక్కడి గ్రీన్ కార్డ్ పొందడం గ్రేట్. అవును… యూఎస్ లో గ్రీన్ కార్డ్ పొందటం అనేది చాలామంది భారతీయుల కల. కానీ.. ఆ కల కొన్ని దశాబ్దాలుగా కలగానే మిగిలిపోతోంది. అందుకే.. చాలా మంది ఎన్ఆర్ఐలు మరోదారి వెతుక్కుంటున్నారు. అదే కెనడా.
అవును… యూఎస్ తో పోల్చితే కెనడా చాలా బెటర్. కెనడాకు వెళ్లడం దగ్గర్నుంచి అక్కడ సెటిల్ అవడం, ఇమ్మిగ్రేషన్ సులభతరం చేయడం, ఉద్యోగ అవకాశాలు బెటర్ గా ఉండటంతో ప్రతి సంవత్సరం దాదాపు 20 వేల మంది భారతీయులు యూఎస్ నుంచి కెనడాకు వెళ్లిపోతున్నారట.
నేను జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నా హెచ్ 1బీ వీసాను 6 సార్లు పొడిగించారు. గ్రీన్ కార్డు కోసం 14 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. ఈ సంవత్సరం జులైలో మేరీలాండ్ నుంచి టొరంటోకు షిఫ్ట్ అయ్యాను.. అంటూ హైదరాబాద్ కు చెందిన దినేశ్ దాసరి చెప్పుకొచ్చారు.
యూఎస్ లో హెచ్ 1బీ, ఎల్1, హెచ్4 ఈఏడీ వీసాలు ఉన్న భారతీయులు దాదాపుగా 9 లక్షల దాకా ఉంటారు. కానీ… హైస్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ యాక్ట్ 2019 ప్రకారం ప్రతి సంవత్సరం 7 శాతం మంది భారతీయులకే గ్రీన్ కార్డ్ ఇచ్చే వెసులుబాటు ఉంది. అంతే కాకుండా.. జాబ్ ఆధారంగా యూఎస్ లో గ్రీన్ కార్డ్ ఇచ్చే విధానానికి ఈ బిల్లు ద్వారా స్వస్తి పలకాలని సెనేట్ భావిస్తోంది. దీంతో యూఎస్ లో జాబ్ చేస్తూ గ్రీన్ కార్డ్ పొందాలనుకునే భారతీయులకు ఆ బిల్లు పెద్ద శాపంలా మారింది.
కెనడాలో మాత్రం ఇమ్మిగ్రేషన్ అటార్నీని కన్సల్ట్ చేయకుండానే… ఆన్ లైన్ లో అప్లయి చేసుకోవచ్చు. ఎక్స్ ప్రెస్ ఎంట్రీ ద్వారా సంవత్సరం లోపే కెనడాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు.
ముంబైకి చెందిన గిరీష్ చవాన్ అనే వ్యక్తి కూడా దాదాపు 18 ఏళ్ల పాటు యూఎస్ లో ఉండి.. ఆ తర్వాత ఈ జులైలో టొరంటోకు షిఫ్ట్ అయ్యారు. 2010 లోనే ఆయన మొదటి గ్రీన్ కార్డ్ అప్లికేషన్ రిజెక్ట్ అయింది. రెండోసారి కూడా రిజెక్ట్ కావడంతో వెంటనే కెనడాకు షిఫ్ట్ అయిపోయారు గిరీష్.