అమెరికా నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ గెలుపును దృవీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సమావేశమైంది. ఈ క్రమంలో బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్యాపిటల్ భవనంలోకి దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ సైతం ప్రయోగించారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో బైడెన్ గెలుపు దృవీకరణ ప్రక్రియకు ఆటంకం కలిగింది. ఆందోళనకారులను అదుపుచేసేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ట్రంప్ ఆదేశాలతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ తరుణంలో ఆందోళనకారులు సంయమనం పాటించాలనీ, పోలీసులకు సహకరించాలని ట్రంప్ తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వాషింగ్టన్ మేయర్ బౌజర్ నగరంలో కర్ప్యూ విధించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రక్షణ బలగాలు క్యాపిటల్ భవనంను తమ అధీనంలోకి తీసుకున్నాయి.
ఈ ఘటనపై అమెరికా చట్టసభ ప్రతినిధులు తీవ్ర దిగ్బాంతిని వ్యక్తం చేశారు. సెనేటర్ మిచ్ మెకానెల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం వంటిదేనని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చట్టసభ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ఆందోళనకారుల చర్యలను ఆయన ఖండించారు.
కాగా నవంబర్ మూడవ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికల్లోనూ 306-232 ఓట్ల తేడాతో జోబైడెన్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ట్రంప్ తన ఓటమిని అంగీకరించలేదు. ఫలితాన్ని తారు మారు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే జార్జియా ఎన్నికల చీఫ్‌నకు ట్రంప్ చేసిన ఫోన్ కాల్ ఆడియో లీక్ అవ్వడం తీవ్ర కలకలాన్ని కల్గించింది. ట్రంప్ మరో సారి బుధవారం తన మద్దతు దారులను ఉద్దేసించి మనం దేనినీ వదిలే ప్రసక్తే లేదు అంటూ ప్రసంగించడంతో ఆందోళనలు చెలరేగాయి.
ఈ ఘటనలపై అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ స్పందించారు. ఈ చర్యలు ఇంతటితో ఆపాలని, ఆందోళనకారులను నిలువరించడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి ట్రంప్ వెంటనే జాతీయ ఛానల్ లో ప్రకటన ఇవ్వాలంటూ జో బైడెన్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…