Mobile phones :ఈ ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితం లో ఒక భాగమై పోయింది అని చెప్పడం లో వింత ఏమి లేదు. పొద్దు పొద్దున్న లేస్తూనే ఫోన్ అందుకుంటారు. రాత్రి పూట కూడా మంచం మీద దానిని దగ్గర పెట్టుకుని నిద్రపోతున్నారు. చాలా మంది ఈ విధం గా నే చేస్తున్నారు.ఒకవేళ మీరు కూడా అలానే చేస్తూ ఉండి ఉంటే … ఇకనైనా ఆ పని మానుకోండి . ఎందుకంటే ఇలా చేయడం వలన అనేక సమస్యలు పుడుతున్నాయి.
ఈ మద్య తాజాగా జరిగిన పరిశోధన ప్రకారం కొన్ని భయాన్ని కలిగించే విషయాలు బయట పడ్డాయి. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ కి దారి తీసే ప్రమాదం రోజు రోజుకి పెరుగుతుందని తెలియచేస్తున్నారు. ఐసిఆర్ఏ స్మార్ట్ ఫోన్ వల్ల చెవి లో ట్యూమర్ వస్తుందని తెలియచేస్తున్నారు. అలాగే క్యాన్సర్ పెరగడానికి కూడా కారణం అవుతుంది అని తెలియ చేస్తున్నారు.
ఫోన్ ద్వారా వచ్చే ఎలెక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుందంటున్నారు. ప్యాంటు జేబు లో స్మార్ట్ ఫోన్ ని పెట్టుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది అని హెచ్చరిస్తున్నారు. ఎగ్ ఫెర్టిలైజేషన్ కూడా మందగిస్తుందని తెలియచేస్తున్నారు. వీటితో పాటు ఒకవేళ మీకు తలకింద ఫోన్ పెట్టుకొని నిద్ర పోయే అలవాటు ఉంటే కనుక వెంటనే దానిని మానేయండి .
ఫోన్ ద్వారా వచ్చే బ్లూ లైట్ స్లీప్ హార్మోన్ మీద ప్రభావం చూపుతుందని. ఇది నిద్రలేమి సమస్యలకు కారణమవుతుందని తెలియచేస్తున్నారు. కాబట్టి నిద్రపోయే అరగంట ముందు మీరు మీ ఫోన్ ని ఆఫ్ చేసి అప్పుడు నిద్ర పోవడం చాలా ముఖ్యం.కుదిరితే ఫోన్ ని అసలు బెడ్ రూమ్ కి బయట ఉంచేయడం చాలా మంచిది.