ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని 25 వ సినిమాగా వచ్చింది వి. ఈ సినిమాలో సుధీర్ బాబు మరో హీరోగా.. అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకులు, అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది. సూపర్ హిట్ అవుతుందనుకున్న అందరి అంచనాలను ఈ సినిమా తలకిందులు చేసింది. భారీ డిజాస్టర్ అన్న టాక్ తెచ్చుకుంది. వరసగా ఫ్లాప్స్ చూస్తున్న నాని ఈ సినిమా కూడా ఫ్లాపయి పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బ తీసింది. ఎంత కష్టపడినప్పటికి నాని కి ఈ సినిమా చేదు అనుభవాన్నే ఇచ్చింది. అంతేకాదు దర్శకుడిగా ఇంద్రగంటి మోహన కృష్ణ కి ఈ రేంజ్ ఫ్లాప్ గతంలో ఎప్పుడు రాలేదు.
అయితే ఈ సినిమా మేకింగ్ పరంగా మాత్రం ప్రశంసలు దక్కించుకుంటోంది. దిల్ రాజు కాంప్రమైజ్ కాకుండా పాటించిన నిర్మాణ విలువలకి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇక వీటి అన్నిటికంటే పోలీస్ ఆఫీసర్ గా నటించిన సుధీర్ బాబు కి ప్రేక్షకుల నుంచి అలాగే ఇండస్ట్రీ వర్గాల నుంచి గొప్పగా ప్రశంసలు రావడం విశేషం. ముందు నుంచి నాని హైలెట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కాని సినిమా రిలీజయ్యాక సీన్ రివర్స్ అయి హీరో సుధీర్ బాబు అన్న టాక్ రావడం సుధీర్ బాబు కి ప్లస్ అవుతోంది.