నాచురల్ స్టార్ నాని 25వ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘V’ ట్రైలర్ కొద్ది సేపటి క్రితమే యూట్యూబ్ లో విడుదలైంది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో నివేథా థామస్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి ఎస్. ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లలో అదితి రావు హైదరి కూడా కనబడుతుంది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే…. క్లుప్తంగా…. నాని ఒక సీరియల్ కిల్లర్ పాత్రను పోషిస్తున్నాడు. సుధీర్ బాబు అతనిని వెతికే పనిలో ఉండే ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. నాని ప్రతిహత్య లో కూడా మజా కోరుకుంటూ ఉంటాడు. ఇక సుధీర్ బాబు కి కూడా ఇలా తనను ఛాలెంజ్ చేసే సీరియల్ కిల్లర్లు అంటే ఇష్టం. వారిని వెతుక్కుంటూ లభించినట్లు క్లూలతో తన అన్వేషణ సాగిస్తూ ఉంటాడు. నివేథా.. సుధీర్ బాబు కి తగినంత ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది.
ట్రైలర్ లోని విజువల్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అయితే చాలా బాగున్నాయి. నాని ప్రతినాయకుడి పాత్రలో ఒదిగిపోయారు. ఇప్పటివరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ కి, ‘బాయ్ నెక్స్ట్ డోర్’ పాత్రలకి పెట్టింది పేరైన నాని ఒక్కసారిగా విలన్ గా అంత రఫ్ గా కనిపించడంతో ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. సుధీర్ బాబు పక్కా ఇన్వెస్టిగేటివ్ కాప్ రోల్ కి సరిపోయారు. మొత్తం ట్రైలర్ నాని, సుధీర్ బాబు చుట్టూనే తిరిగింది. ఇక కథలో కూడా మనం మిగతా పాత్రల కి అంత ప్రాముఖ్యతను ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక యాక్షన్ సీక్వెన్స్ లు అయితే వేరే లెవెల్ లో ఉన్నాయి అని చెప్పాలి.
లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడిన తర్వాత ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చిన ఏ ఒక్క తెలుగు సినిమా కూడా ఇప్పటివరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. యావరేజ్, బిలో యావరేజ్ అనుకున్న చిత్రాలే తప్ప హిట్ అనిపించుకున్న చిత్రం ఒక్కటీ లేదు. కానీ ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా ప్రేక్షకుల మనసు దోచే లాగా ఉంది. తెలుగు సినీ అభిమానులంతా ఈ చిత్రం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది చూసేయండి.