Vaani kapoor : వాణీ కపూర్ ఇప్పుడు తెలుగులో పెద్దగా వినిపించడం లేదు గానీ, గతంలో నాని తో ఆహా కళ్యాణం అనే సినిమా చేసింది. ఈ ఒక్క సినిమా తర్వాత మళ్ళీ ఈమెకి తెలుగులో అవకాశం రాలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం బాగానే సినిమాలు చేస్తోంది. శుధ్ దేశీ రొమాన్స్ సినిమాతో రెచ్చిపోయి మరీ తన అందచందాలతో అలరించింది. డీప్ లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ తో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత వార్ అనే సినిమాలోనూ వాణీ కపూర్ నటించి మంచి క్రేజ్ ని దక్కించుకుంది. ఈ రెండు సినిమాలతో బాలీవుడ్ లో బాగానే క్రేజ్ సంపాదించుకున్నప్పటికి అక్కడ స్టార్ డం మాత్రం దక్కించుకోలేకపోయింది.
తనకంటే తర్వాత వచ్చిన హీరోయిన్స్ మాత్రం బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాలలో కూడా నటించే అవకాశాలను అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా పాపులర్ అవుతున్నారు. అందుకు ఉదాహరణ కియారా అద్వానీనే, తాప్సీలనే చెప్పవచ్చు. ఇప్పుడు పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి వాళ్ళు రేస్ లోకి దూసుకు వచ్చారు. కానీ వాణీ మాత్రం ఆ రేంజ్ కి రాలేకపోతోంది. ప్రస్తుతం వాణీ కపూర్ హిందీలో మూడు సినిమాలలో నటించింది. ఈ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటితో తన కెరీర్ ఊపందుకుంటుదని భావిస్తోంది. ఈ సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలీదు గాని ఇప్పుడు మాత్రం సూపర్ ఛాన్స్ దక్కించుకుంది.
Vaani kapoor : వాణీ కపూర్ ని సలార్ లో ఓకే చేశారట.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే హీరోయిన్ కి ఏ రేంజ్ వస్తుందో అందరికీ తెలిసిందే. హీరోయిన్ గా నటించకపోయినా కూడా ఓ క్యారెక్టర్ చేస్తే రేంజ్ ఎక్కడికో వెళుతుంది. ఆయన ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తుండగా అందులో హీరోయిన్ గా శృతి హాసన్ హీరోయిన్ నటిస్తోంది. కాగా ఇందులో పవర్ ఫుల్ విలన్ పాత్ర ఒకటుందని మేకర్స్ చెబుతున్నారు. కానీ ఆ పాత్రకి ఎవరిని ఎంచుకున్నారో వెల్లడించలేదు. ఇంతలోనే ఆ నటుడి భార్య పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ ని మాత్రం ఓకే చేశారట. త్వరలో ఈ విషయానికి సంబంధించిన అధికారక ప్రకటన రానుందని తెలుస్తోంది.