Vadde Naveen: వడ్డే నవీన్… 90 వ దశాబ్దం అమ్మాయిలకు ఈ హీరో సూపరిచితమే. అప్పటిలో వడ్డే నవీన్ అంటే అమ్మాయిల కలల రారాజు. ఎన్నో సినిమాలలో హీరో గా నటించి ఎన్నో హిట్లు అందుకుని అంతకన్నా త్వరగా వెండితెరకు దూరమయ్యాడు వడ్డే నవీన్.

ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. వడ్డే నవీన్ హీరో గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలుగుతున్న రోజులలో ఆయన నందమూరి వారి కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. కానీ అనదికాలంలోనే వడ్డే నవీన్ ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు.
నవీన్, ‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరపై కనిపించాడు. ఈ సినిమా తరువాత అతడికి ఆఫర్లు వెల్లువెత్తాయి. నవీన్ తండ్రి వడ్డే రమేష్ తెలుగు సినిమా నిర్మాత. కానీ నవీన్ సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా మాత్రం ‘పెళ్లి’ అనే చెప్పాల. ఆ తరువాత మనసిచ్చి చూడు, మా బాలాజీ, ప్రేమించే మనసు, చక్రీ లాంటి ఎన్నో సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ టాప్ హీరోగా ఎదిగాడు.
వడ్డే నవీన్ దాదాపుగా 28 సినిమాల్లో హీరోగా నటించారు. కానీ కొన్ని కారణాల వలన ఆయన తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశారు. ఇక ఎంతోమందికి నవీన్ గురించి తెలియని విషయం ఏమిటంటే అతని మెుదటి భార్య నందమూరి వారి వారసురాలు. ఆ తరువాత వడ్డే నవీన్ రెండవ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అప్పటిలో నందమూరి మరియు వడ్డే కుటుంబాల మధ్య చాలా సాన్నిహిత్యం ఉండడంతో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ పుత్రిక అయిన చాముండేశ్వరిని నవీన్ కి ఇచ్చి వివాహం చేశారు. కానీ వీరి విడాకుల వెనుక ఉన్నా కారణం ఏమిటో ఇప్పటికీ బయటకు రాలేదు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.