Vaishnav Tej: మెగా లైనప్..! స్పోర్ట్స్ డ్రామాలో హీరో వైష్ణవ్ తేజ్..!!

vaishnav tej in sports drama
Share

Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ Vaishnav Tej మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో తొలి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. 100 కోట్ల కలెక్షన్లు సాధించిన డెబ్యూ హీరోగా రికార్డులు, సంచలనాలు సృష్టించాడు. నటనపరంగా కూడా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. గతేడాదే విడుదల కావల్సిన ఈ సినిమాను కరోనా, లాక్ డౌన్ వల్ల వాయిదా వేసి ఈ ఏడాది విడుదల చేశారు. ఓటీటీ ఆఫర్లు వచ్చినా కాదనుకుని ధియరటికల్ రిలీజ్ కు వెళ్లిన నిర్మాతలకు లాభాల పంటే పండింది. దీంతో ఇండస్ట్రీ చూపు ఇప్పుడు వైష్ణవ్ తేజ్ పై కూడా పడింది. నటనలో తను చూపిన పరిణితికి కొత్త అవకాశాలు వస్తున్నాయి.

vaishnav tej in sports drama
vaishnav tej in sports drama

ఉప్పెన పూర్తై రిలీజ్ మధ్య గ్యాప్ లోనే గతేడాది అక్టోబర్ – నవంబర్ నెలల సమయంలో దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు. అతితక్కువ కాలంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథనాయికగా నటించింది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ మూడో సినిమా కోసం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. తమిళ అర్జున్ రెడ్డి.. ఆదిత్యవర్మ దర్శకుడు గిరీషయ్య దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను మెగా ఫ్యామిలీతో సక్సెస్ ఫుల్ మూవీస్ తీసిన అగ్ర నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తోందని తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ను కోవిడ్ పరిస్థితులు చక్కబడ్డాక తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై పూర్తి అఫిషియల్ న్యూస్ రావాల్సింది. మరోపక్క వైష్ణవ్ తేజ్ తన నాలుగో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిస్తారని గతంలోనే వార్తలు వచ్చాయి.  ఆ తర్వాత తొలి హిట్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ వైష్ణవ్ తోనే మరో సినిమా చేయనున్నారని కూడా తెలుస్తోంది. ఈ లైనప్ నిజమే అయితే మెగా హీరో లక్కీ చాన్స్ కొట్టినట్టే.

 


Share

Related posts

నారప్ప నే డామినేట్ చేస్తున్న ప్రియమణి ..!

GRK

” వాళ్ళకి షాక్ కొట్టేలా చేయగలిగాం ” జగన్ కీలక వ్యాఖ్యలు !

sekhar

Today Horoscope డిసెంబర్ 16th బుధవారం రాశి ఫలాలు

siddhu