vaishnav tej – Nagarjuna : కంటెంట్ బాగుంటే బాక్సాఫీస్ వద్ద సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుందో ఉప్పెన సినిమా తెలియజేసింది.. ఈ స్థాయిలో ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ రికార్డులను అందుకోవడంతో ఇండస్ట్రీ లో కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది.. ఇంతకు ముందు ఎన్నో లవ్ స్టోరీలు హిట్ అయ్యాయి.. కానీ ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకోలేదు.. ఈ ఒక్క సినిమా తోనే వైష్ణవ్ తేజ్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది.. తాజాగా ఈ హీరోపై అక్కినేని వారి దృష్టి పడింది..
ఉప్పెన హిట్ సాధించడంతో వైష్ణవ తేజ్ కెరియర్ కు ఒక మంచి బూస్ట్ లభించింది.. అక్కినేని నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ ప్రొడక్షన్స్ లో వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.. అయితే ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను వైష్ణవ్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు హాట్ టాపిక్.. నాగార్జున ఏకంగా మూడు కోట్ల రూపాయల భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకు డిఫరెంట్ కథను నాగార్జున ఎంచుకున్నారు.. ఈ సినిమాను ఓ కొత్త దర్శకుడితో రూపొందిస్తున్నట్టు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?