Vaishnav tej : రొమాంటిక్ హీరోయిన్‌తో కొత్త సినిమా.. సెట్స్‌పైకి వచ్చిన వైష్ణవ్ తేజ్

Share

Vaishnav tej : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఈ ఏడాది ప్రారంభంలో డెబ్యూ సినిమా ‘ఉప్పెన’ తో హీరోగా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. డెబ్యూ హీరోగా దాదాపు 20 ఏళ్లపైగా ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ డెబ్యూ సినిమా కహోనా ప్యార్ హై సినిమాతో ఆయన క్రియేట్ చేసిన రికార్డ్ కూడా వైష్ణవ్ తేజ్ బ్రేక్ చేశాడు. ఇక మొదటి సినిమాతో బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టడం కూడా ఓ రికార్డ్. అందుకే ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే క్రేజీ హీరోగా మారిపోయాడు వైష్ణవ్ తేజ్.

vaishnav-tej-new movie with romantic heroine
vaishnav-tej-new movie with romantic heroine

ఈ నేపథ్యంలో పెద్ద బ్యానర్ నుంచి మెగా మేనల్లుడుకి క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి. ఆ మధ్య ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో ఒక మూవీ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ తో మంచి హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ గిరీషయ్య తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా మొదలవ్వాల్సి ఉండగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు అన్నీ సినిమాలు మళ్ళీ మొదలవుతున్న తరుణంలో వైష్ణవ్ కూడా తన సినిమాను మొదలు పెట్టాడు.

Vaishnav tej : నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ సినిమా..?

ఈ సోమవారం నుంచి రెగ్యులర్ గా ప్రారంభించారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఫస్ట్ షెడ్యూల్ లో చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొనే కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. ఇందులో వైష్ణవ్ తేజ్ జంటగా ‘రొమాంటిక్’ మూవీ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. కాగా ఇప్పటికే వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో తన రెండవ సినిమాను కంప్లీట్ చేశాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా చిత్రీరకణ జరిగింది. రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. అలాగే త్వరలో నాగార్జున నిర్మాణంలో ఓ సినిమాను ప్రకటించనున్నారని సమాచారం.


Share

Related posts

SuperMario Game: సూపర్ మారియో గేమ్ బ్రహ్మానందం వెర్షన్ చూశారా..!!నవ్వు ఆపుకోలేరు..!!

bharani jella

‘మీ రాక మాకెంతో సంతోషమండి’

somaraju sharma

‘తమ్ముళ్లపై ఆగ్రహం’

somaraju sharma