Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య Vaishnavi Chaitanya గురించి తెలుసు కదా. తను ఇప్పుడు సోషల్ మీడియా స్టార్. తనకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ అనే తేడా లేకుండా.. వైష్ణవికి మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ ఉన్నారు.

వైష్ణవి చైతన్య.. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ తో తను ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
ప్రస్తుతం తనకున్న రేంజే వేరు. తను ఎక్కడ ఉంటే అక్కడ రికార్డుల మోతే. సోషల్ మీడియాలో తను ఏ వీడియో పెట్టినా.. ట్రెండింగ్ లో ఉండాల్సిందే. అది వైష్ణవి రేంజ్.
Vaishnavi Chaitanya : మిస్సమ్మగా సూపర్ డూపర్ సెట్ అయిన వైష్ణవి చైతన్య
వైష్ణవి చైతన్య తాజాగా మిస్సమ్మ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ మూడు ఎపిసోడ్స్ ముందే రిలీజ్ అయ్యాయి. అవి సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టించాయి.
పల్లెటూరు అమ్మాయిగా నటించిన వైష్ణవి యాక్టింగ్ సూపర్బ్. పల్లెటూరు అమ్మాయికి.. సిటీ అబ్బాయితో పెళ్లి ఫిక్సయితే.. ఆ తర్వాత పల్లెటూరు అమ్మాయి అని చెప్పి.. ఆ సిటీ అబ్బాయి ఆ అమ్మాయిని రిజెక్ట్ చేస్తే.. అతడిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది.. అనే కథాంశంతో వచ్చిందే మిస్సమ్మ వెబ్ సిరీస్.
తాజాగా ఎపిసోడ్ 4 రిలీజ్ అయింది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మిస్సమ్మను చూసేయండి.