ట్రెండింగ్ న్యూస్

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య.. ‘మిస్సమ్మ’ వెబ్ సిరీస్ లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది

vaishnavi chaitanya missamma last episode released
Share

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య తెలుసు కదా. సోషల్ మీడియా స్టార్ తను. తనకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే మతి పోతుంది. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ కూడా. తనకు ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. నాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ సినిమాలోనూ వైష్ణవికి మంచి క్యారెక్టర్ వచ్చింది. తను ఆ సినిమాలో నటించింది. ఇలాగే తనకు ఇంకా సినిమాల ఆఫర్లు, వెబ్ సిరీస్ ల ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయి.

vaishnavi chaitanya missamma last episode released
vaishnavi chaitanya missamma last episode released

నిజానికి.. వైష్ణవి చైతన్య ఫేమస్ అయింది సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ తో. షణ్ముఖ్ తో కలిసి నటించిన వైష్ణవి… ఆ సిరీస్ తో ఫేమస్ అయిపోయింది.

ఆ తర్వాత మళ్లీ తను నటించిన వెబ్ సిరీస్ మిస్సమ్మ. ఇప్పటికే మిస్సమ్మకు సంబంధించిన నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి.. పల్లెటూరు అమ్మాయి తనకు పెళ్లి ఫిక్స్ అయ్యాక… ఆ పెళ్లి కొడుకు పల్లెటూరు అమ్మాయి అని చెప్పి తనతో పెళ్లి క్యాన్సిల్ చేస్తే…. తనపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనేదే ఈ మిస్సమ్మ కథ.

మిస్సమ్మగా వైష్ణవి చైతన్య ఒదిగిపోయింది. పల్లెటూరు అమ్మాయిగా ఇరగదీసి.. ఆ తర్వాత సిటీలో ఉండే మోడ్రన్ అమ్మాయిలా పర్ ఫెక్ట్ గా సెట్ అయిపోయింది.

Vaishnavi Chaitanya : యూట్యూబ్ లో ట్రెండింగ్ లో మిస్సమ్మ చివరి ఎపిసోడ్

తాజాగా మిస్సమ్మ చివరి ఎపిసోడ్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఎపిసోడ్ కు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో సంచలనాలను సృష్టిస్తోంది. చివరి ఎపిసోడ్ లో ఓ ట్విస్ట్ కూడా ఉంది. నిజానికి పెళ్లి చూపుల్లోనే మహా అనే అబ్బాయిని ఇష్టపడుతుంది వైష్ణవి. కానీ.. మహా తనతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా… ఇంకా తననే లవ్ చేసి… తను పనిచేసే ఆఫీసుకు వచ్చి రివేంజ్ తీర్చుకొని అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ… మధ్యలో అదే ఆఫీసులో పనిచేసే ప్రసాద్ పరిచయం కావడం… అతడితో ప్రేమలో పడటం… చివరకు ప్రసాద్ నే వైష్ణవి పెళ్లి చేసుకోవడం.. ఇదే చివరి ఎపిసోడ్ లో ట్విస్ట్.

ఇంకెందుకు ఆలస్యం… మిస్సమ్మ చివరి ఎపిసోడ్ ను చూసి ఎంజాయ్ చేయండి మరి.


Share

Related posts

YS Jagan: జగన్ కి మూడు నెలలు సవాళ్లే..! కష్టాలు మామూలుగా లేవు..!!

Muraliak

Tragedy: విద్యుతాఘాతంతో అన్నతమ్ములు సజీవ దహనం .. దేవులపల్లిలో విషాదం

somaraju sharma

NTR: 9999 నంబర్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో ఎన్టీఆర్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా..?

amrutha