Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య Vaishnavi Chaitanya గురించి మీకు తెలుసు కదా. తను సోషల్ మీడియా స్టార్. సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ తో సోషల్ మీడియాకు పరిచయమైన స్టార్ ఆమె. వైష్ణవికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. తనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో.

వైష్ణవి చైతన్య.. తాజాగా మరో వెబ్ సీరిస్ లో నటిస్తోంది. దాని పేరే మిస్సమ్మ. ఒక పల్లెటూరు అమ్మాయి పాత్రలో అమాయకురాలిగా నటించింది వైష్ణవి. తన అమాయకత్వం, పల్లెటూరితనం వల్ల నిశ్చితార్థం అయ్యాక తనను వద్దని ఓ వ్యక్తి వెళ్లిపోతాడు. దీంతో తనను ఎలాగైనా కన్విన్స్ చేసి తనను పెళ్లి చేసుకునేలా చేయడం కోసం వైష్ణవి ఏం చేసింది అనేదే ఈ మిస్సమ్మ కథ.
మిస్సమ్మ లో మహాలక్ష్మిగా వైష్ణవి చైతన్య.. తన అద్భుతమైన నటనతో అదరగొట్టింది. ఇప్పటికే విడుదలైన రెండు ఎపిసోడ్స్ లో మిస్సమ్మ అదరగొట్టేసింది.
Vaishnavi Chaityana : మూడో ఎపిసోడ్ గా వచ్చిన మీడియేటర్
అయితే.. మూడో ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ లో కూడా వైష్ణవి.. తనను రిజెక్ట్ చేసిన వ్యక్తిని ఎలా ప్రేమలో దింపాలా? అని ప్లాన్లు వేస్తుంది. దానికోసం తన ఆఫీసులోనే పనిచేసే మీడియేటర్ తో మాట్లాడుతుంది. తన ప్రేమ గురించి అతడికి చెప్పాలంటూ కోరుతుంది. కానీ.. అది బెడిసికొడుతుంది. తను ఏం చేసినా.. తనను పెళ్లి చేసుకోవడం అసాధ్యం.. అంటూ అతడు మీడియేటర్ కు చెబుతాడు. ఆ మాటలు విన్న మహాలక్ష్మి చాలా బాధపడుతుంది. ఇక.. అతడి కోసం తిరగడం వేస్ట్ అనుకొని.. ఇంటికి వెళ్లిపోవాలనుకుంటుంది. అయితే.. ఈ మధ్యలో మీడియేటర్ ప్రసాద్.. వైష్ణవి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనేది తెలియాలంటే మాత్రం వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.