NewsOrbit
న్యూస్

వైష్ణోదేవి ప్రసాదం మీకు కావాలా ?

దేశంలో అమ్మవారి క్షేత్రాలలో బాగా ప్రసిద్ధి చెందినవాటిలో వైష్ణోదేవి దేవాలయం ఒకటి. ఇక్కడ అమ్మ దర్శనం అపూర భాగ్యం. అమ్మ ప్రసాదం మరింత విశేషం. అయితే కొవిడ్‌తో జమ్ముకశ్మీర్‌లోని ఈ దేవాలయానికి రావడం కష్టతరంగా మారింది. దీంతో భక్తులకు అమ్మప్రసాదం అందించాలనే తపనతో దేవాలయ బోర్డు చేసిన ఏర్పాటు గురించి తెలుసుకుందాం…
కష్టాల కాలంలో భాగంగా భగవంతుడి దగ్గరకు భక్తుడు వెళ్ళకుండా సాక్షాత్తూ భగవంతుడే భక్తుల వద్దకు వచ్చి వరాలు ఇస్తున్నాడు. దీంట్లో భాగంగానే అమ్మలగన్న అమ్మ శ్రీ వైష్ణోదేవి ప్రసాదాలను భక్తుల వద్దకే నేరుగా పంపించే ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. వైష్ణోదేవి అమ్మవారి ప్రసాదాలను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నవారికి అమ్మవారి ప్రసాదాన్ని డోర్ డెలివరీ ద్వారా అందజేస్తున్నారు నిర్వాహకులు.

దర్శనాలు, ప్రసాదాలు అంతా ఆన్లైన్లోనే జరిగిపోతున్న క్రమంలో జమ్మూకశ్మీర్లో కొలువైన అమ్మవారు ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయ నిర్వాహకులు అమ్మవారి ప్రసాదాన్ని బుక్ చేసుకున్న భక్తుల ఇంటి వద్దకే అమ్మవారి ప్రసాదాన్ని పంపించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. జమ్ము కశ్మీర్ లోని త్రికూట పర్వతాలపై కొలువైన వైష్ణోదేవి అమ్మవారిని ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూంటారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దర్శనాలకు ఇబ్బంది ఏర్పడటంతో ప్రసాదం హెం డెలివరీ చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. లెఫ్టినెంట్ గవర్నరు మనోజ్ సిన్హా చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. భక్తులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న 72 గంటల్లోగా స్పీడ్ పోస్టు ద్వారా పూజా, ప్రసాదాలను అందించనున్నారు. వైష్ణోదేవి ఆలయ వెబ్ సైట్ ద్వారా వీటిని బుక్ చేసుకోవాలని సూచించారు.

author avatar
Sree matha

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?