న్యూస్ సినిమా

వకీల్ సాబ్ .. కేజీఎఫ్ 2 రికార్డ్స్ ని బ్రేక్ చేయలేకపోయాడే ..?

Share

వకీల్ సాబ్ నుంచి తాజాగా టీజర్ రిలీజై యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తోంది. సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలే కాదు కొత్త సినిమాల టీజర్లు, ట్రైలర్లు సందడి చేస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ అభిమాన స్టార్ హీరోల సినిమాల ట్రైలర్లను విడుదల చేస్తూ చిత్ర దర్శక నిర్మాతలు తమదైన శైలిలో సినిమాలపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి పండుగ బొనాంజాగా విడుదలైన క్రాక్ మూవీ మంచి హిట్‌తో దూసుకుపోతోంది. అయితే కరోనా కారణంగా పెద్ద పెద్ద సినిమాలు ఏవీ పూర్తికాలేని పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం అవి ఇంకా షూటింగ్ దశలోనే ఉండటంతో ప్రేక్షకులు కాస్తంత నిరుత్సాహపడ్డారు. సో ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో దర్శకులు కొత్త పంథాను స్టార్ట్ చేశారు. పండుగ వేళ ప్రేక్షకులకు పసైందన విందును అందిస్తున్నారు. ఇప్పటికే కేజీఎఫ్ 2 ట్రైలర్ ను విడుదల చేసిన ప్రశాంత్ నీల్ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. రాకింగ్ స్టార్ యష్ ను ట్రైలర్ లో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలోనే రికార్డులు బ్రేక్ చేసే వ్యూస్‌ను కొల్లగొడుతోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 పై భారీ అంచనాలను పెంచేస్తోంది.

ఇక లేటెస్ట్ గా మన సౌత్ ఇండియన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ వకీల్ సాబ్. పండుగ పూట పవర్ స్టార్ అభిమానులను అలరించేందుకుగాను చిత్ర యూనిట్ టీజర్‌ ను విడుదల చేసింది. మొదటి సారి వకీలుగా పవన్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. సోషల్ మీడియాలో విడుదలైన ఈ టీజర్ ను చూస్తూ పవన్ అభిమానులు నిజంగానే పండుగ చేసుకుంటున్నారు. వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ అయిన కొత సమయంలో మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

KGF 2 Teaser to be Deleted From YouTube | Yash Slammed For Promoting  Cigarette Smoking

అయితే వకీల్ సాబ్ .. కేజీఎఫ్ 2 రికార్డ్స్ ని బ్రేక్ చేయలేకపోయాడంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్‌ను సృష్టిస్తోంది కేజీఎఫ్ 2. కానీ వకీల్ సాబ్‌కు అంతటి రెస్పాన్స్ రావడం లేదంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. కేజీఎఫ్ 2 కు ఉన్నంత క్రేజ్ వకీల్ సాబ్‌ టీజరుకు లేదని చెవులు కొరుక్కుంటున్నారు. అయితే అల్‌రెడీ ఇదే సినిమాను అమితాబ్ తీయడం అది మంచి విజయం సాధించడంతో..తెలిసిన కథే కాబట్టి అంత ఆసక్తి చూపించడం లేదన్న మాట వినిపిస్తోంది. అయితే అనూహ్యంగా టాప్ లోకి వచ్చాడు వకీల్ సాబ్. ఇప్పటికే ఎనిమిది మిలియన్ల పైగా వ్యూస్ పొందిన వకీల్ సాబ్ టీజర్.. ఏడు లక్షలకు పైగా లైక్స్ సాధించింది. లైక్స్ లో కూడా వకీల్ టాప్ లో నిలిచాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వకీల్ సాబ్ పేరు ట్రెండింగ్ లో ఉంది.

 


Share

Related posts

ఆధార్ సెంటర్ కు వెళ్ళనవసరం లేదు.. హెల్ప్ లైన్ కు కాల్ చేయండి..

bharani jella

SVP: ఏపీలో బిగ్ ఈవెంట్ ప్లాన్ చేసిన “సర్కారు వారి పాట” సినిమా యూనిట్..??

sekhar

ఫెయిర్ అండ్ లవ్లీ కాదు ఇక గ్లో అండ్ లవ్లీ ! ఫేస్ క్రీమ్ పేరు మార్పు వెనుక ఇంత స్టోరీ ఉందా ?

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar