Vakeel saab – chiranjeevi : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తో వచ్చిన సినిమా వకీల్ సాబ్.. తాజాగా ఈ సినిమాను వీక్షించిన చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు.. ఈ ట్వీట్ లో చిరు రాసిన మాటలు వర్ణనాతీతం.. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది..
అమ్మ తో పాటు అందరం వకీల్ సాబ్ థియేటర్ లో.. Showtime #VakeelSaab pic.twitter.com/FCVeJG3nLQ
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2021
మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అదే వేడి.. అదే వాడి.. అదే పవర్.. ప్రకాష్ రాజ్ తో కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతం..! నివేద థామస్ అంజలి అనన్య వాళ్ల పాత్రల్లో జీవించారు.. తమన్ మ్యూజిక్, డిఓపి వినోద్ ప్రాణం పోశారు.. దిల్ రాజు కి, బోనీ కపూర్ కి వేణు శ్రీరామ్ కి మిగతా టీమ్ అందరికీ శుభాకాంక్షలు.. అన్నింటికీ మించి మహిళలకి ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం.. ఈ వకీల్ సాబ్ కేసుల అనే కాదు అందరి మనసుల్ని గెలుస్తాడు.. అని చిరంజీవి ట్వీట్ చేశారు..
ఇప్పటికే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకు వెళ్తుంది.. వకీల్ సాబ్ గా పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నాడు..