Pawan Kalyan: దాదాపు మూడు సంవత్సరాల పాటు సినిమా రంగానికి పవన్ కళ్యాణ్ దూరం కావటం తో తాజాగా రిలీజ్ అయిన “వకీల్ సాబ్” సినిమా…పవన్ అభిమానుల ఆకలి తీర్చేసింది. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది మే నెలలో రిలీజ్ కావాలి. కానీ మధ్యలో కరోనా మహమ్మారి రావటంతో లాక్ డౌన్ విధించడంతో… థియేటర్లు క్లోజ్ అయిపోయాయి. దీంతో దేశంలో పరిస్థితులు మొత్తం తలకిందులు కావడంతో ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర పవన్ స్టామినా ఏంటో నిరూపించింది.
సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించినా గాని.. బాక్సాఫీస్ దగ్గర తన ఫామ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు పవన్. ప్రపంచవ్యాప్తంగా పది రోజులకి “వకీల్ సాబ్” గ్రాస్ 135 కోట్లు సాధించినట్లు.. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న టాక్. టికెట్ రేటు తగ్గించిన మరోపక్క సినిమా సిట్టింగ్ విషయం ఆంక్షలు విధించిన గానీ పవన్.. సునామీని బాక్సాఫీస్ దగ్గర ప్రభుత్వాలు ఆపలేకపోయాయి అని తాజా లెక్కల పై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఓవరాల్ గా కచ్చితంగా సినిమా మరింత కలెక్షన్లు సాధించడం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సారి లాయర్ పాత్రలో సినిమాలో అద్భుతంగా కనిపించడంతో అభిమానులు బాగా రిసీవ్ చేసుకున్నారు. వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ పింక్ రీమేక్ అయినా గాని .. పవన్ అభిమానుల అభిరుచికి తగ్గ రీతిలో ..డైరెక్టర్ వేణు శ్రీరామ్ అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ..పవన్ అభిమానులను రక్తికట్టించింది అని చెప్పవచ్చు. టోటల్ గా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ “వకీల్ సాబ్” ద్వారా అదరగొట్టింది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా 50 రోజులు పూర్తయ్యే వరకూ ఓటీటీలో రిలీజ్ అయ్యే ప్రసక్తి లేదని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు.