Vakeel saab : వకీల్ సాబ్ సెన్సార్ రిపోర్ట్ ఇదే..!!

Share

Vakeel saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తో రాబోతున్న చిత్రం వకీల్ సాబ్..!! హిందీ జాతీయ అవార్డు సినిమా పింక్ రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది.. సెన్సార్ కార్యక్రమాలను లేటెస్ట్ గా పూర్తి చేసుకుంది.. తాజాగా ఈ సినిమా మా కు సెన్సార్ పూర్తయ్యాక యు/ ఏ సర్టిఫికెట్ అందజేసినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది..!!

Vakeel saab : sensor report
Vakeel saab : sensor report

మధ్యతరగతికి చెందిన ముగ్గురు అమ్మాయిలు అనుకోకుండా ఒక కేసులో చిక్కుకుపోగా వాళ్లను కాపాడేందుకు లాయరు ఎటువంటి ప్రయత్నాలు చేశాడు అనే కథతో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ మూవీ టైం 154  నిమిషాలు గా ఉందని సమాచారం. హిందీ ,తమిళంతో పోలిస్తే తెలుగులో మూవీ రన్ టైం ఎక్కువగా ఉందని టాక్.. దీనికి కారణం ఇందులో శ్రుతిహాసన్ పాత్ర ఉండడమేనని సమాచారం. ఈ సినిమాను బోని కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Share

Related posts

‘ఎన్టీఆర్ సహకారం”తో బాబును మరో అదురు దెబ్బ కొట్టనున్న జగన్ !

Yandamuri

ముగ్గురిలో ఎవ‌రు ?

Siva Prasad

Job Notification : సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2021 నోటిఫికేషన్..!

bharani jella