NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vakeel saab: బాక్సాఫీస్.. పాలిటిక్స్.. రెండింటినీ షేక్ చేస్తున్న వకీల్ సాబ్..!!

Vakeel saab: జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా బాక్స్‌ ఆఫీస్‌‌తో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈ సినిమా విడుదల మొదలు.. ఏపీలో రాజకీయ అలజడి నెలకొంది. ‘వకీల్ సాబ్‌’ విడుదల, టికెట్ ధరలకు సంబంధించి పెను దుమారం రేగుతోంది.

Vakeel saab shaking both politics and box office .. !!
Vakeel saab shaking both politics and box office .. !!

ఇప్పటికే ఈ వ్యవాహం కోర్టులో ఉండగా.. తాజాగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వకీల్ సాబ్ సినిమాపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సినిమాను రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. సినిమా హిట్ అయినంత మాత్రాన, తిరుపతిలో గెలవలేరు అని ఎద్దేవా చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ సోదరుడు.. నాగబాబు తీవ్రంగా స్పందించారు. మంత్రి పేర్ని నానిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

మంత్రిని రేబిస్ వ్యాక్సిన్ తీసుకోమన్న నాగబాబు

ట్విట్టర్ వేదికగా స్పందించిన నాగబాబు.. ‘మీకు ఏం అయ్యింది నాని గారూ.. మీరు కరోనా వ్యాక్సిన్‌తో పాటు రేబిస్ వ్యాక్సిన్ వేసుకోవాల్సింది. ఇది చాలా అత్యవసరం. ఎవరైనా మినిస్టర్ నానికి రేబిస్ వ్యాక్సిన్‌ను పంపించండి. వ్యాక్సిన్ డొనేట్ చేయానలుకునే వారు ఆయన పేరు చెబితే ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు కూడా ఫ్రీ’ అంటూ నాగబాబు ఘాటైన పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అదేదో మీ అన్నదమ్ములకే అవసరమన్న మంత్రి!

అయితే, నాగబాబు చేసిన ఈ ట్వీట్‌కి మంత్రి పేర్ని నాని కూడా అంతేస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ‘పరోపకారి పాపన్న.. నాగబాబు గారూ పేర్నినాని లాంటి బయటివారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్‌కు రేబిస్ వ్యాక్సిన్ తక్షణ అవసరం. వెంటనే ఆయనను వెతికి రేబిస్ వ్యాక్సిన్ వేయించండి. ఆలస్యమైతే మీకు కూడా రేబిస్ వ్యాక్సిన్ అవసరం అవుతుంది. అన్నదమ్ములిద్దరికీ వ్యాధి తగ్గిన తరువాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాడు’ అంటూ నాగబాబుకు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ఇద్దరి ట్విట్టర్ పోరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్‌ను అమాంతం పెంచేసింది.

 

author avatar
Yandamuri

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju