భీమ్ ఫర్ రామరాజు వచ్చినప్పటి నుంచి అందరు అంతులేని ఆతృతగా ఎదురు చూసింది రామరాజు ఫర్ భీమ్ కోసమే. రామరాజుగా చరణ్ వీడియో టీజర్ కి తారక్ ఇచ్చిన గంభీరమైన వాయిస్ ఓవర్ అంద్భుతంగా వచ్చింది. ఇక రాజమౌళి మార్క్ విజువల్స్ తో మెగా అభిమానులు నందమూరి అభిమానులు సర్ప్రైజ్ అయ్యారు. అదే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ టీజర్ అయిన రామరాజు ఫర్ భీమ్ కి రిపీటయింది. చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువగానే బజ్ క్రియోటయుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లను శంక్తివంతమైన పోరాట యోధులుగా వెండితెరమీద ఆవిష్కరించబోతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ ముగ్గురు కలయికలో భారీ బడ్జెట్ తో “రౌద్రం రణం రుధిరం” తెరకెక్కుతుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన రామరాజు ఫర్ టీజర్ సంచలనం సృష్ఠిస్తోంది.
రామరాజు ఫర్ భీమ్ వీడియోకు తారక్ అభిమానులు ఫాలోవర్స్ మిలియన్ లైక్స్ రికార్డు క్రియోట్ చేయాలనుకొని మిస్ అయ్యారు. 24 గంటల్లో మిలియన్ యూట్యూబ్ లైక్స్ కోసం చేసిన ప్రయత్నం విఫలమవడంతో ఇప్పుడు ఆ రికార్డ్ ను పవర్ స్టార్ ఫ్యాన్స్ క్రియోట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీగా చేస్తున్న వకీల్ సాబ్ టీజర్ ని మేకర్స్ త్వరలో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. అందుకే భీమ్ రికార్డ్ ని వకీల్ సాబ్ బ్రేక్ చేయాస్తాడని నమ్మకంగా ఉన్నారట మెగా ఫ్యాన్స్.