దాదాపు మూడేళ్ళకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో నిర్మిస్తుండగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా నిర్మించాలన్నది దిల్ రాజుకి 10 ఏళ్ళకి పైనే ఉన్న కల. ఆ కల నెరవేర్చుకునేందుకు వకీల్ సాబ్ కి భారీగానే ఖర్చు పెట్టాడు. వాస్తవంగా ఒక రీమేక్ సినిమాకి ఇంత భారీగా బడ్జెట్ ని కేటాయించాల్సిన అవసరం లేదు. కాని కేవలం పవన్ కళ్యాణ్ కోసమే ఖర్చుకి ఎమాత్రం వెనకాడకుండా దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తుండగా కేవలం పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సిన కొన్ని కోర్ట్ సన్నివేశాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయని తెలుస్తుంది. కాగా ఈ సీన్స్ కోసం పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుంచి డేట్స్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అదే గనక జరిగితే ఖచ్చితంగా సంక్రాంతి బరిలో వకీల్ సాబ్ ని దిల్ రాజు దింపడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా సంబంధించి లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఎక్స్ క్లూజివ్ గా ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్ సహా రీసెంట్ గా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇన్నాళ్ళు వకీల్ సాబ్ నుంచి కిక్ ఇచ్చే అప్డేట్ రావడం లేదనుకుంటున్న ఫ్యాన్స్ కి ఇది మాంచి ఊపునిచ్చే న్యూస్ అని చెప్పాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?