NewsOrbit
న్యూస్

అనవసరంగా చంద్రబాబుకి హ్యాండ్ ఇచ్చి.. వైకాపాలోకి వచ్చా అనుకుంటున్న వల్లభనేని వంశీ?

ఏపీ రాజకీయాల్లో… కాదు కాదు ప్రత్యేకింఛి టీడీపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీది ఒక ప్రత్యేకమైన శైలి. ఆ ప్రత్యేకత గురించి కాసేపు పక్కనపెడితే… టీడీపీ ఎమ్మెల్యే అయిన వంశీ ఆ పార్టీతోనూ, ఆ పార్టీ అధినేతతోనూ విభేధించి… అనధికారిక వైకాపా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా తనను ప్రత్యేక ప్రతినిధిగా గుర్తించాలని స్పీకర్ ని విజ్ఞప్తి చేసిన సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో ఈ అనధికారిక హోదా ఇంకెంతకాలం… ఒక సారి రిజైన్ చేసేసి, ఉప ఎన్నికలలు వెళ్లి గెలిచి… తన సత్తా తన సత్తానే తప్ప.. టీడీపీ సత్తా కాదని నిరూపించాలనుకున్నారని వార్తలొచ్చాయి. కానీ…ఈ విషయంలో వంశీ వెనక్కి తగ్గారని తెలుస్తోంది!

తన గెలుపు తన కష్టార్జితం… ఇందులో టీడీపీ పాత్ర ఉండొచ్చేమో కానీ చంద్రబాబు పాత్ర అస్సలు లేదని గంటాపథంగా చెప్పే వంశీ… తనను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కొత్తగా రాజినామా చేస్తే ఎంత..? చేయకపోతే ఎంత..? అనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అదేంటి తనపై తనకు ఎంతో ధైర్యం, కులమతాలకు అతీతంగా తన వెంట ఉన్న తన ప్రజలపై మరెంతో నమ్మకం అని చెప్పే వంశీ… తనను తాను “వితౌట్ టీడిపీ” నిరూపించుకునే అవకాశం వస్తే.. పైగా జగన్ లాంటి బలమైన శక్తి వెనకాల ఉంటే ఇలా జంకుతున్నారేంటని ప్రశ్నలు రావడం మొదలయ్యింది!

ఆ ప్రశ్నలకు గన్నవరం నుంచి వచ్చిన సమాధానాం ఏంటంటే… గన్నవరంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వంశీకి కష్టమేనట. కారణం… వంశీ మీద ఓడిపోయిన వర్గం ఎలాగూ ఆయన కోసం పనిచేయదు.. ఇక వంశీ సామాజికవర్గం ఎక్కువభాగం టీడీపీ వైపు ఉంటుంది.. కాకపోతే బీసీ వర్గాలు కాస్త అటు ఇటూ ఉండొచ్చంటున్నారు! ఇదే క్రమంలో వంశీపై ఇంటా బయటా కాస్త వ్యతిరేకత ఉండటం వల్ల.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వంశీకి కాస్త ఇబ్బందే అని అంటున్నారు!

ఇన్ని విషయాలపై క్లారిటీ వచ్చిన అనంతరం… ఇక రాజీనామా, మళ్లీ ఎన్నికలు వంటి ఆలోచనలను విరమించుకున్నారని అంటున్నారు గన్నవరం జనం! ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రిస్క్ చేసి.. ఫలితం రివర్స్ అయితే … ఇక శాస్వత విరామమే అనేది వారి అభిప్రయంగా ఉంది! మరి ఈ పరిస్థితులు రావడం వల్ల… వంశీ ఏమైనా పశ్చాత్తాప పడుతున్నారా లేక… ఇప్పటికీ తాను చేసింది కరక్టే అనే బలమైన అభిప్రాయంతోనే ఉన్నారా అనేది తెలియాల్సి ఉందనేది గన్నవరం ప్రజల మాట!!

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju