Valteru Veeraiah: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్స్ పాటలు బాగా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక మెగా ఫాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య ట్రైలర్ విడుదల అయింది ఈ ట్రైలర్లో మెగాస్టార్ తన ఉగ్రరూపం చూపించారు..
తాజాగా విడుదలైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవి తనదైన మార్కును చూపించారు.. మాస్ యాక్షన్ తో పవర్ ఫుల్ డైలాగ్స్ తో చిరు సినిమాపై హైప్ క్రియేట్ చేశారు.. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా సంక్రాంతి బరిలో హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది.. వాల్తేరు వీరయ్య ట్రైలర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే అనూహ్యమైన రెస్పాన్స్ ను సొంతం చేస్తుంది.. లక్షల సంఖ్యలో వ్యూస్ ను సొంతం చేసుకుంది..
ఈ సినిమా కోసం మెగా అభిమానులు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. చాలాకాలం తర్వాత చిరంజీవి ఫుల్ లెన్త్ మాస్ పాత్రలో కనిపించడంతో ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగాయి.. మాస్ మూలవిరాట్ వేట వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖ జరగనుంది. ఆదివారం జరిగే ఈవెంట్ కోసం చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ లోపే ట్రైలర్ తో అభిమానులకు ట్రీట్ ఇవ్వనుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ నటించింది. మాస్ మహారాజా రవితేజ, కేథరిన్ ట్రెసా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.