Vamsi Paidipally: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చే అన్ని సినిమాలు హై-బడ్జెట్తో.. టాప్ హీరోలతోనే వస్తుంటాయి. మొదటి సినిమా మున్నా తప్ప వంశీ దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కాకపోతే బడ్జెట్ ఎక్కువ పెట్టిస్తాడని.. సినిమాకి మంచి టాక్ ఉన్న కూడా రికవరీ కష్టం అనే బ్యాడ్ ఇంప్రెషన్ కూడా అతనిపై ఉంది. ఊపిరి సినిమా కథ బాగున్నా క్యాస్ట్ విషయంలో ఫెయిల్ అయింది. అలానే మహర్షి సినిమా కూడా హైబడ్జెట్ విషయంలో సమస్యలు ఎదుర్కొంది. మహర్షి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది. దాంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బతికి బయట పడ్డారు. లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది.
Vamsi Paidipally: కంటెంట్ ఉంటేనే నడిచేది
ప్రస్తుతం వంశీ కోలీవుడ్ మూవీ ‘వారసుడు’తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. తమిళ హీరో విజయ్ నటించిన ఈ సినిమాను ద్విభాష చిత్రంగా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈ సినిమాని పక్క తెలుగు సినిమాగా చెప్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్బంగా రిలీజ్ కానున్నా ఈ సినిమాను మన తెలుగు ప్రేక్షకులు అసలు పట్టించుకుంటారో లేదో తెలీదు. ఆల్రెడీ సంక్రాంతి పండుగకి ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలతో పోటీపడి గెలవాలంటే వారసుడు సినిమాలో టాలీవుడ్ ఫ్యాన్స్కి నచ్చే బెస్ట్ కంటెంట్ వుండి తీరాలి.
లేదంటే నష్టపోవడమే
నిజానికి వారసుడు మూవీ డబ్బింగ్ది. మళ్లీ ఇది వేరే రాష్ట్రం హీరోది. కావున ప్రేక్షకులలో ఆసక్తి తక్కువగానే ఉంటుంది. ఇక వారసుడు సినిమాపై తమిళ్ లో కూడా పెద్దగా అంచనాలు లేవు. తమిళ ప్రేక్షకులలో వంశీ ఎప్పుడూ రొటీన్ సినిమాలే తీస్తారనే ఒక అభిప్రాయం ఉంది. వారి అభిప్రాయాలకు తగినట్లే ఈ సినిమా టైటిల్స్, ప్రమోషన్స్ ఉన్నాయి. ఎప్పటిలానే ఈ సినిమాకి కూడా వంశీ భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తుంది. కానీ వసూలు ఆ రేంజ్ లో రాకపోతే నిర్మాతల నష్టపోక తప్పదు.