Balakrishna : బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణకి జంటగా కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతోంది. హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా బాలయ్య అఖండలో రెండు వైవిధ్య భరీతమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఒకటి రైతు పాత్ర అయితే మరొకటి అఘోర పాత్ర.
ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య పాత్రలకి సంబంధించిన రెండు లుక్‌లు రిలీజై అభిమానులతో పాటు ప్రేక్షకులలోనూ అంచనాలు భారీగా పెంచాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 28న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా పూర్తి కాగానే బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమా మొదలవనుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
Balakrishna : బాలకృష్ణ సినిమాలో వరలక్ష్మీకి అవకాశం ఇవ్వబోతున్నారట.
అయితే మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న బాలకృష్ణ సినిమాలో వరలక్ష్మీకి అవకాశం ఇవ్వబోతున్నారట. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు సాధించింది. ఈ సినిమాలో వరలక్ష్మీ పోషించిన జయమ్మ పాత్రకి బాగా ఆదరణ లభించింది. అలాగే అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాలో లాయర్‌గాను వరలక్ష్మీకి చాలా మంచి పేరు వచ్చింది. దాంతో టాలీవుడ్ లో వరలక్ష్మీకి బాగా పాపులారిటీ పెరిగింది. ఈ క్రమంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ను దృష్టిలో పెట్టుకొని ఒక పాత్రను డిజైన్ చేశాడట గోపీచంద్ మలినేని. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ వస్తుందని సమాచారం.