కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఈమె తాజాగా సంక్రాంతికి రిలీజ్ అయిన రవితేజ ‘క్రాక్’ చిత్రం లో జయమ్మ పాత్ర లో నటించి ప్రేక్షకులను మన్ననను పొందారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన ఫ్యామిలీ సీక్రెట్స్ కొన్నిటిని వెల్లడించారు.
వరలక్ష్మి, కోలీవుడ్ లోని సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురే కానీ రాధిక కూతురు కాదు. ఆయన మొదటి ఈమె జన్మించింది. రాధిక ఈమెకు సవతి తల్లి. చిన్నతనం నుంచే ఈమెకు నటన మీద ఎంతో ప్రీతీ ఉండడంతో అటు చదువు పూర్తి అవ్వగానే సినిమాల్లోకి వచ్చినట్టు చెప్పారు. ఆమె హీరోయిన్ గా పరిచయమయిన మొదటి సినిమా ‘పోడా పొడి’. ఆ తర్వాత ఆమె కన్నడ సినీ ఇండస్ట్రీ లోకి ప్రవేశించి దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ మెప్పిస్తోంది.
ఈ సందర్భంలో వారలక్ష్మి తన సవతి తల్లి అయిన రాధిక గురించి ప్రస్తావిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నిజానికి ఆమె నా కన్న తల్లి కాదు కానీ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు ఎప్పుడూ ఆమె సవతి తల్లి లా అనిపించలేదు. ప్రస్తుతం నా కెరీర్ కు సంబంధించిన ఎన్నో సూచనలు ఇస్తూ నన్ను గైడ్ చేసస్తోంది. కానీ నేను ఎప్పుడైనా ఆమెకు ఏదైనా ఒక రహస్యం చెబితే దాన్ని వెంటనే బయటకు లీక్ చేసేస్తుంది. అయితే ఇలా నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టింది ఆమె.’ అని తెలిపింది వరలక్ష్మి. కానీ అందులో ఏ దురుద్దేశం లేదని ఆమె స్పష్టం చేసింది. ‘సీక్రెట్ లను ఆమె కావాలని బయటకు చెప్పేయదు కానీ పొరపాటున ఆలా జరిగిపోతూ ఉంటుంది’ అని వివరించింది వరలక్ష్మి.