Varun sandesh : టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలలో వరుణ్ సందేశ్ ఒకరు. అమెరికాలో చదువుతున్న సమయంలో క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నలుగురు హీరోలున్నా వరుణ్ అందరికంటే బాగా హైలెట్ అయ్యాడు. ఈ సినిమాలో తమన్నా వరుణ్ కి జంటగా నటించింది. ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన హ్యాపీడేస్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమా చూసిన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వెంటనే తన బ్యానర్ లో నిర్మించిన కొత్త బంగారు లోకం సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు.
మొదటి సినిమా భారీ హిట్. ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. రెండవ సినిమా ఏకంగా దిల్ రాజు నిర్మాణంలో అనగానే ఇక ఈ యంగ్ హీరో పెద్ద హీరో అయిపోవడం ఖాయమని అందరూ చెప్పుకున్నారు. అందరు భావించినట్టుగానే దిల్ రాజు నిర్మాతగా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమవుతూ కొత్త బంగారు లోకం తెరకెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. భారీ హిట్ అందుకొని వరుణ్ కి వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కాయి. దిల్ రాజు నిర్మాణంలోనే మరో సినిమా మరో చరిత్రలో నటించాడు. అయితే ఈ సినిమా భారీ ఫ్లాప్ అని ముద్ర వేసుకుంది.
Varun sandesh : ఇందువదన సినిమాతో ఫాంలోకి వస్తాడా లేదా చూడాలి.
ఈ సినిమా మాత్రమే కాదు ఆ తర్వాత వరుణ్ సందేశ్ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించలేదు. దాంతో ఆయనకి అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ లో కనిపించాక మళ్ళీ ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా ఇందువదన అనే రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా వరుణ్
కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఇందువదన సినిమాలో వరుణ్ బోల్డ్ పాత్రలో నటిస్తుండటమే. ఇంతకాలం చేయని క్యారెక్టర్ మొదటిసారి చేస్తుండటంతో హిట్ అందుకుంటాడా అని మాట్లాడుకుంటున్నారట. మరి ఈ యంగ్ హీరో ఈ బోల్డ్ సినిమాతో ఫాంలోకి వస్తాడా లేదా చూడాలి.