Varun sandesh: ‘ఇందువదన’ సినిమాతో రొమాంటిక్ యాంగిల్ టచ్ చేస్తూ రీ ఎంట్రీ ఇస్తున్న వరుణ్ సందేశ్..తేడా కొడితే ఇక లైఫ్‌లో కనిపించడేమో

Share

Varun sandesh: వరుణ్ సందేశ్..టాలీవుడ్‌లో ఒకదశలో స్టార్ హీరో అనే గ్రాఫ్ ఎడ్జ్ టచ్ చేశాడు. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్ అందుకొని ఇండస్ట్రీ హిట్ అందుకున్న హ్యాపీడేస్ సినిమాతో వరుణ్ సందేశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే ఓ సినిమా చేసిన మిల్కీ బ్యూటీ తమన్నాతో వరుణ్ సందేశ్ జంటగా నటించడం ఈ సినిమాలో ప్రత్యేకత. ఇక వరుణ్ బాడీ లాంగ్వేజ్ అమ్మాయిలకి బాగా కనెక్ట్ అయింది. కొంతమంది అమ్మాయిలకైతే డ్రీమ్ బాయ్‌గానూ మారాడు వరుణ్ సందేశ్.

varun-sandesh romatic touch in indu vadana
varun-sandesh romantic touch in indu vadana

దాంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా మంచి క్రేజ్ వచ్చేసింది. శేఖర్ కమ్ముల ఇచ్చిన ఈ క్రేజ్‌తో ఏకంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్‌లో అవకాశం అందుకున్నాడు. హ్యాపీడేస్ సినిమా చూసిన దిల్ రాజు..ఆయన బ్యానర్‌లో శ్రీకాంత్ అడ్డాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త బంగారు లోకం అనే సినిమాను ప్లాన్ చేశాడు. ఈ సినిమాకి ఓ కొత్త హీరో అయితే బావుంటుందని సర్చ్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో హ్యాపీడేస్ చూసిన దిల్ రాజు వెంటనే శేఖర్ కమ్ములకి కాల్ చేసి వరుణ్ సందేశ్ డీటేయిల్స్ తీసుకున్నాడు. వెంటనే ఈ కొత్త బంగారు లోకంలో అవకాశం అందుకున్నాడు.

Varun sandesh: వరుణ్ సందేశ్ గురించి దాదాపు అందరూ మర్చిపోయారనే చెప్పాలి.

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత నటించిన ఎవరైనా ఎపుడైనా, కుర్రాడు, మరో చరిత్ర లాంటి సినిమాలు వచ్చి వరుసగా ఫ్లాప్ సినిమాలుగా మిగిలాయి. దాంతో వరుణ్ సందేశ్ క్రేజ్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. అయితే సంపత్ నంది దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన సినిమా ఏమైంది ఈ వేళ అనే సినిమాలో నటించే అవకాశం అందుకున్నాడు. ఈ సినిమా అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. దాంతో మళ్ళీ వరుణ్ సందేశ్ ఫాంలోకి వచ్చాడు.

అయితే ఆ తర్వాత ఛమ్మక్ చల్లో, ప్రియతమా నీవచట కుశలమా, సరదాగా అమ్మాయితో, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, డి ఫర్ దోపిడి, నువ్వలా,నేనిలా, ఈ వర్షం సాక్షిగా, పాండవులుపాండవులు తుమ్మెదా ఇలా వరుణ్ సందేశ్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపవుతూ వచ్చాయి. దాంతో వరుణ్ సందేశ్ దాదాపు ఫేడవుట్ అయ్యాడు. సత్యదేవ్ లాంటి హీరోలు వచ్చి మంచి క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇండస్ట్రీలో బాగా నిలదొక్కుకున్నారు. దాంతో వరుణ్ సందేశ్ బాగా వెనకబడిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఈ హీరో గురించి దాదాపు అందరూ మర్చిపోయారనే చెప్పాలి.

Varun sandesh: వరుణ్ సందేశ్‌కి హీరోగా అవకాశాలు దక్కుతున్నాయి.

అలాంటి సమయంలో బిగ్ బాస్ సీజన్‌ 3లో అవకాశం అందుకున్నాడు. బిగ్ బాస్‌తో బాగా పాపులర్ అయ్యాడు వరుణ్ సందేశ్. భార్యతో కలిసి హౌజ్‌లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దాంతో జనాలలో కాస్త మళ్ళీ వరుణ్ సందేశ్‌కి క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్‌తో మళ్ళీ వరుణ్ సందేశ్‌కి హీరోగా అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘ఇందువదన’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్‌ను టచ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు సినిమా మీద భారీ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా గనక హిట్ అయితే మళ్ళీ హీరోగా ఫాంలోకి వచ్చినట్టే.


Share

Related posts

ఆర్‌సీఈపీ ఒప్పందం పైన 15 దేశాల సంతకాలు …!!

Vissu

ఎంపీ రాజు గారి కొత్త లేఖ లో జగన్ ను పొగిడాడా లేక తిట్టాడా..?

arun kanna

కేసీఆర్ మాట చెల్ల‌డం లేదు…. వ‌ద్ద‌న్న ప‌నే చేస్తున్న తెలంగాణ రైతులు

sridhar