Varun tej : వరుణ్ తేజ్ గని సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అల్లు బాబీ – సిద్దు ముద్ద భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటి సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. గని సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ లుక్ తో పాటు జులై 30 తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అఫీషియల్ గా ప్రకటించారు.
కాగా వరుణ్ తేజ్ గని సినిమాతో పాటు ఎఫ్ 3 సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. వెకటేష్ – వరుణ్ తేజ్ – తమన్నా – మెహ్రీన్ హీరో హీరోయిన్స్ గా భారీ మల్టీస్టారర్ సినిమా గా తెరకెక్కుతోంది. కాగా వరుణ్ తేజ్ గని సినిమాతో పాటు ఎఫ్ 3 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇక ఎఫ్ 3 కూడా రిలీజ్ ఆగస్టు 27 న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు దిల్ రాజు బృందం ప్రకటించారు. ఫ్ 2 కంటే ఫ్ 3 లో మూడు రెట్లు ఫన్ ఉంటుందని ఫ్యామిలీ ఆడియన్స్ ని మరోసారి నవ్వుల్లో ముంచేస్తుందని చెప్పుకుంటున్నారు.
Varun tej : వరుణ్ తేజ్ విలన్ గా యంగ్ హీరో ..?
కాగా వరుణ్ తేజ్ గని సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర – సీనియర్ స్టార్ హీరో జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక వరుణ్ కు ధీటుగా యంగ్ హీరో నవీన్ చంద్ర ని విలన్ పాత్రకు ఎంపిక చేశారు. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నవీన్ చంద్ర కూడా బాక్సర్ గా కనిపించబోతున్నాడట. అంతేకాదు ఇద్దరి మద్య బాక్సింగ్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. నవీన్ చంద్ర ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తున్నాడు. అరవింద సమేతలో పోషించిన పాత్రకి మంచి పేరు సంపాదిచుకున్నాడు. కాగా లైగర్ సినిమాకి పోటీగా గని సినిమాని తయారు చేస్తున్నట్టు సమాచారం.