న్యూస్ సినిమా

వరుణ్ తేజ్ ఒక్కడే మెగా హీరోలలో సపరేట్ .. ఎందుకని ..?

Share

వరుణ్ తేజ్ సినిమాలన్ని ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకుంటున్నాయి. varun tej ఎంచుకుంటున్న కథ ల మధ్య పూర్తిగా వ్యత్యాసం ఉండటమే ఈ సక్సస్ కి కారణం అంటున్నారు విశ్లేషకులు. ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలు ఒక ఫార్ములా ప్రకారమే సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా మూడు ఫైట్లు.. ఆరు పాటలు అన్న పాత ఫార్ములానే ఇప్పటికీ చాలా మంది హీరోలు ఫాలో అవుతున్నారు. కాని మెగా ప్రిన్స్ varun tej మాత్రం ఆ ఫార్ములాని అసలు పట్టించుకోవడం లేదు.

ముందు నుంచి కూడా varun tej ఎక్కువగా ప్రయోగాలకి ఆసక్తి చూపిస్తున్నాడు. లోఫర్, మిస్టర్ సినిమాల తర్వాత వరుణ్ తేజ్ ఇంకా కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడు. కంచె సినిమా ఇమేజ్ కోసం చేయలేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే అంతరిక్షం సినిమా కూడా మాస్ ఎలిమెంట్స్ ఉండాలి అని కాకుండా మంచి ప్రయోగాత్మక సినిమా కాబట్టే కమిటయ్యాడు. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి సినిమాలు చేస్తుండటం ఒక్క varun tej వల్లే అవుతోంది.

తొలిప్రేమ.. ఎఫ్2.. ఫిదా.. గద్దలకొండ గణేష్.. ఈ నాలుగు సినిమాలు.. చాలా భిన్నంగా ఉంటాయి. ఒక కథ కథ ఒక కథ సంబంధం ఉండదు. ఎఫ్2.. సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ తో కలిసి varun tej చేసిన మల్టీస్టారర్. సాధారణంగా సీనియర్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఇమేజ్ దెబ్బ తింటుందన్న ఆలోచన ఉంటుంది. కానీ వరుణ్ తేజ్ అవేమీ పట్టించుకోవడం లేదు. కథ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇక తాజా చిత్రం ‘ గని ‘ కూడా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు కి అవకాశం ఇచ్చాడు వరుణ్ తేజ్. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో varun tej కి జంటగా సాయీ మంజ్రేకర్ నటిస్తోంది.


Share

Related posts

Corona : గుడ్ న్యూస్ఃక‌రోనా క‌థ తేల్చే కొత్త వ్యాక్సిన్ మ‌న దేశంలో ఏం చేస్తుందంటే….

sridhar

విస్ట్రాన్ సంస్థలో దాడిపై స్పందించిన ఆపిల్

Teja

Energy Drink: పాలలో ఈ పొడిని కలుపుకుని తాగితే 60ఏళ్లలో కూడా 20ఏళ్ల శక్తి వస్తుంది..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar