NewsOrbit
న్యూస్

wasim jaffer : క్రికెట్ జట్టులో వసీం జాఫర్ మతతత్వాన్ని ప్రోత్సహించారా? అది నిజమేనా??

wasim jaffer: భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతం. ఎలాంటి భేషజాలు లేకుండా సాగిపోయే ఒక క్రీడ. ఎక్కడైనా ఏమైనా గొడవలు రావచ్చుగానీ క్రికెట్ విషయంలో మాత్రం భారతీయులంతా ఒక్కటై పోతారు. అయితే ఇప్పుడు ఈ క్రికెట్ లోకి మాత్రం వచ్చినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్ క్రికెట్ కోచ్ వసీం జాఫర్ తీరుపట్ల వస్తున్న వార్తలను మెయిన్ స్ట్రీమ్ మీడియా కప్పి పుచ్చినా సోషల్ మీడియాలో మాత్రం దీని మీద ఆసక్తికర చర్చ సాగుతోంది.

wasim jaffer
wasim jaffer

wasim jaffer ఎం జరిగింది అంటే?

వసీం జాఫర్ ముంబైకి చెందిన క్రికెట్ ఆటగాడు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్. భారత జట్టుకు రెండు మూడు టెస్టులు ఆడిన ప్లేయర్. ఎక్కువ ఫస్ట్ క్లాసు మ్యాచ్లోనే ఉండిపోయిన వసీం జాఫర్ ఇటీవల రిటైర్మెంట్ అయ్యే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి క్రికెట్ కోచ్గా వెళ్లారు. అయితే ఉత్తరాఖండ్లో క్రికెట్ జట్టులో కీ ముంబైకి చెందిన కొందరు ఆటగాళ్లను వసీం జాఫర్ కావాలని తీసుకువచ్చారని,

అది కూడా ఆయన మతానికి సంబంధించిన ఆటగాళ్లను ఉత్తరాఖండ్ క్రికెట్ టీమ్ లో ఆడించడం మే కాక ఓ కీలక ముంబై ఆటగాడిని ఉత్తరాఖండ్ క్రికెట్ కెప్టెన్ చేసేందుకు వసీం జాఫర్ తీవ్రంగా ప్రయత్నించారు అనేది ఆరోపణ. అంతేకాదు వసీం జాఫర్ క్రికెట్ లోకి డ్రెస్సింగ్ రూమ్ లోకి కొందరు మత పెద్దలను తీసుకువచ్చి నమాజ్ చేయించారు అనే ఆరోపణలు సంచలనం అవుతుంది. దీనిపై పెద్ద పెద్ద క్రికెటర్లు ఎవరు మాట్లాడకుండా మౌనం గానే ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశం కీలకంగా మారింది.

wasim jaffer
wasim jaffer

భారత క్రికెట్ లో భిన్నత్వంలో ఏకత్వం

భారతదేశ క్రికెట్ జట్టు లో ఎప్పుడూ మతానికి సంబంధించిన చర్చ గాని ఆరోపణలు గాని రాలేదు. ఫరూక్ ఇంజనీర్ వంటి పార్సీలు, మనసూర్ అలీఖాన్ పటౌడీ వంటి ప్లేయర్స్ భారత జట్టుకు నాయకత్వం వహించిన వరకూ వస్తే… క్రికెట్ లో ఎప్పుడూ మతానికి సంబంధించిన అంశాలపై చర్చ గానీ డ్రెస్సింగ్ రూమ్లో మతాలకు ప్రార్థన చేయడానికి వీలు లేకుండా గతంలోనే నిర్ణయాలు తీసుకున్నారు. మతానికి సంబంధం లేకుండా ఎందరో ముస్లిములు, హిందువులు కలిపి క్రికెట్లో భారత దేశాన్ని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి.

అయితే ఎప్పుడూ లేనట్లుగా భారత క్రికెట్ లోకీ మతం తాలూకా ఛాయలు ఇప్పుడు కనిపించడం ఆందోళన రేపుతోంది. వసీం జాఫర్ జట్టు ఎంపిక విషయంలో మతప్రాతిపదికన తీసుకువస్తున్నారని, డ్రెస్సింగ్ రూంలోకి మౌల్వి నీ పిలిచి ప్రార్థనలు చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రమైనవి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వసీం జాఫర్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు.

క్రికెటర్లు మౌనం..

వసీం జాఫర్ మీద వచ్చిన ఆరోపణలపై క్రికెట్ ప్రపంచం మౌనం వహించింది అనే చెప్పాలి. జాఫర్ పై ఆరోపణలు వచ్చినపుడు మొట్టమొదటగా గొంతు విప్పింది అనిల్ కుంబ్లే. గతంలో కుంబ్లే కోచ్ గా ఉన్న సమయంలోనూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనూ క్రికెటర్ల అంతా మౌనం వహించారు. అది ఎంత బాధగా ఉంటుందో స్వయంగా అనుభవం ఆయనకు మద్దతుగా నిలిచాడు. మీరు చేసిన పని మంచిదే మిమ్మల్ని కోచ్గా కోల్పోయిన దురదృష్టవంతులు అంటూ ట్వీట్ చేసాడు. అలాగే విదర్భ క్రికెట్ అసోసియేషన్ తో పాటు ముంబైలో తనతో పాటు క్రికెట్ ఆడిన సహచరులు జాఫర్ కు ధైర్యం నింపే మాటలు చెప్పారు.

అనుమతి తీసుకున్నారా?

సోషల్ మీడియాలో వచ్చే విపరీతమైన ట్రోల్స్ కు భయపడే పెద్ద పెద్ద క్రికెట్ స్టార్లు జాఫర్ కు మద్దతు పలకకుండా మౌనం వహించారు అనీ తెలుస్తోంది. అయితే బయో బబుల్ లో ఉన్న ఉత్తరాఖండ్ జట్టు నిబంధనలు ఉల్లంఘిస్తూ వసీం జాఫర్ మౌలావి నీ పిలిచారు అన్న ఆరోపణలపై టీం సభ్యుడు అబ్దుల్లా మరో రకంగా చెబుతున్నారు. శుక్రవారం రోజు మౌల్వి లేకుండా మేము ప్రార్థనలు చేయలేమని మధ్యాహ్నం 3:30 సమయానికి ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నమోదు చేశామని అబ్దుల్లా చెబుతున్నాడు.

మౌళి వేణు పిలవచ్చా లేదా అనేది ముందుగా తాను కోచ్ వసీం జాఫర్ ను సంప్రదించాలని ఆయన టీమ్ మేనేజర్ అనుమతి తీసుకోవాలని వద్దకు పంపించారు అని చెబుతున్నారు. ఆయన అనుమతి ఇచ్చిన తర్వాతనే మౌలి వచ్చి ప్రార్థనలు చేశారు అన్నది అబ్దుల్లా చెప్పిన మాట. దీంతో ఈ వివాదం మరో మలుపు తిరిగి నట్టు అయింది. అసలు ఇండియన్ క్రికెట్లోకి మతం వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు దీనిని కావాలనే కొందరు వివాదం చేస్తున్నారు అనే ఆరోపణ ఉంది. రోజుకో మలుపు తిరుగుతున్న క్రికెట్ మతం వివాదంలో ఇంకేమి జరుగుతాయో చూడాలి.

author avatar
Comrade CHE

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju