Vasthu :వాస్తు ను అనుసరించి ఇంటి ఆవరణలో చెట్ల పెంపకం ఎలా ఉంటే మంచిదో తెలుసుకుందాం.. సాధారణంగా ఇంటి ఆవరణలో పచ్చదనం, అందం కోసం చెట్లు పెంచుతుంటాము. ఇంటికి చెట్టు అందం తేవడం తో పాటు చల్లని గాలిని కూడా ఇస్తాయి. అయితే వృక్షాలను పెంచే సమయంలో కొన్ని కట్టుబాట్లను పాటిస్తే సంతోషమయ జీవితాన్నిపొందుతాము.
ఇంటికి తూర్పు వైపు రావిచెట్టు, దక్షిణం వైపు జువ్వి చెట్టు, పశ్చిమం వైపు మర్రిచెట్టు, ఉత్తర దిశలో మేడి చెట్లు ఉండకపోవడమే మంచిది. అలా ఉన్న పక్షంలో ఆ చెట్ల భారం ఇంటి మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పైన చెప్పిన విధంగా నాలుగు దిశలలో వరుసగా వేప చెట్టు , మామిడి చెట్టు , అరటి చెట్లు కూడా ఉండరాదని వాస్తు శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు. ఇంటి వాయువ్య దిశలో ముళ్ల తో ఉండే చెట్లు, ఈశాన్య దిశలో అరటి చెట్టు ఉండకూడదట. అలాగే దక్షిణ దిశలో మందిరాలు, మఠాలు, పశ్చిమ దిశలో జలాశయాలు, ఉత్తర దిశలో పెద్ద చెరువులు కూడా లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇలా ఉంటే కనుక గృహంలో ఎల్లప్పుడూ బాధలు, కష్టనష్టాలు వస్తాయి వాస్తు నిపుణులు తెలియచేస్తున్నారు.
గృహంలో చెట్లను పెంచేందుకు కూడా శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం. హిందూ వాస్తు శాస్త్రం ప్రకారం ఇళ్లలో కొన్ని చెట్లు మాత్రమే పెంచుకోవాలి అవి ఏమిటో తెలుసుకుందాం. శాస్త్రీయంగా చూస్తే ఉసిరి,మునగ, చింత, పనస నేరేడు వంటి చెట్లు, మిరియాలు వంటి మొక్కలు ఇంట్లో పెంచడం వలన ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. అలాగే మామిడి, నిమ్మ, అరటి, కొబ్బరి, వేప, దానిమ్మ, ద్రాక్ష వంటి చెట్టు ఇళ్లలో పెంచినట్లయితే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సమకూరుతాయని హిందూ సంప్రదాయ వాస్తు శాస్త్రం తెలియచేస్తుంది .