Vastu: ఇంటి వాస్తును బట్టి మన ఇంటి సంపదను ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు ముఖ్యంగా ఇంటికి సంబంధించి ప్రతిదీ కూడా వాస్తు ప్రకారం ఉన్నట్లయితే మన ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది ఇకపోతే మన ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం ఏవి ఎక్కడ ఉంటే ఏది మంచిదో ఏది చెడ్డదో మనం ఎప్పుడూ తెలుసుకుందాం. నార్త్ ఈస్ట్ ప్రదేశాలలో బీరువా ఉంచుకోవడం వలన ఎంత సంపాదించినా కూడా డబ్బు ఏమాత్రం నిలవదు. ఖర్చులు పెరిగి ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోతుంది. నార్త్ మరియు ఈస్ట్ ప్రదేశాలలో ఇంటిని పరిశుభ్రంగా మరియు ఓపెన్ గా ఉంచడం వలన మంచి ఫలితం ఉంటుంది. మంచి ఎనర్జీ కూడా వస్తుంది. ఆ ప్రదేశంలో దేవుడిని కూడా పూజించుకోవచ్చును. ఇంటి ప్రధాన ద్వారం ముందు వైర్లు కానీ పోల్స్ లేదా ఇతర వస్తువులను ఉంచకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

నార్త్ కుబేరునికి మంచి ప్రదేశం.. సంపద కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ ప్రదేశంలో పాజిటివ్ గా ఉంచుకోవాలి. ముఖ్యంగా మన ఇల్లు ఒక దేవాలయం లాంటిది ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ప్రయోజనాలను పొందవచ్చును. ఫిష్ అక్వేరియం సంపాదనకు కారకంగా పరిగణిస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న ఫిష్ అక్వేరియంలో చేపలు తిరుగుతూ ఉండటం వల్ల మంచి సంపద రావడం మరియు ఎనర్జిటిక్ గా కూడా ఉంటాము. బెడ్ రూమ్లో బెడ్ కూడా ఫ్లోర్ కి ఒక అడుగు ఎత్తులో ఉండాలి. బెడ్ రూమ్ లోని కిటికీలను రోజుకి ఒక 20 నిమిషాల పాటు అయినా తెరిచి ఉంచాలి. దానివలన ఫ్రెష్ ఎనర్జీ అనేది లోపలికి రావడం జరుగుతుంది. గడియారం పనిచేయకపోవడం వలన ఆర్థికంగా స్థిరంగా ఉండలేరు. కావున ఇంట్లో గడియారాలు అన్నీ కూడా పని చేసేటట్టు చూసుకోవాలి.
ఇంటికి ప్రధాన ద్వారం అనేది చాలా ముఖ్యం. అది పాజిటివ్ అయినా మరియు నెగిటివ్ అయిన ఇంటి ప్రధాన ద్వారం గుండానే ప్రవేశిస్తుంది. ముఖ్యంగా వాస్తు నియమాలలో చాలా ముఖ్యమైనది ఇంట్లో గాలి మరియు వెలుతురు బాగా వస్తూ ఉండాలి. విండోస్ డోర్లు ఓపెన్ గా ఉండాలి ఇలా ఉండడం వలన సంపద వెల్లువలా వచ్చి పడుతుంది. ఇటువంటి జాగ్రత్తలు కొన్ని కొన్ని చూసుకోవడం వలన కొంతవరకు మేలు జరుగుతుందని చెప్పవచ్చును.