NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వాసుపల్లి గణేశ్ మామూలోడు కాదు .. వైసీపీ లోకి అడుగు పెట్టిన 24 గంటల్లో జగన్ కి బ్లాక్ బస్టర్ న్యూస్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు దిమ్మతిరిగిపోయే షాకిస్తూ, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సీఎం వైఎస్ జగన్ మెహన్ రెడ్డిని కలిసిన సంగ‌తి తెలిసిందే.

 

సీఎం వైఎస్‌.జగన్‌ సమక్షంలో ఎమ్మెల్యే గణేష్ కుమారులు వాసుపల్లి సాకేత్, వాసుపల్లి సూర్య వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వాసుపల్లి సూర్య, సాకేత్‌కు కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ ఆహ్వానించారు. సాంకేతిక అంశాల నేప‌థ్యంలో కండువా క‌ప్పుకోలేదు.

వాసుప‌ల్లి గ‌ణేష్ లెక్క ఏంటంటే…

వైసీపీలో చేరిన సంద‌ర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ వైసీపీలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి ద‌మ్మున్న నాయ‌కుడ‌ని పేర్కొన్న గణేష్ పేదలకు సంక్షేమ పథకాలు అందించే మనస్సు ఉందని అన్నారు. పేదలకు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అందించడం టీడీపీ వల్ల సాధ్యం కాదని ఆయన అన్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటు ఆహ్వానించదగ్గ విషయమన్న ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలో చేరానని అన్నారు. 13 ఏళ్లు టీడీపీకి సేవలందించానని తెలిపారు. విశాఖకు వలస వచ్చిన నేతలే అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారన్న ఆయన విశాఖ వాసిగా రాజధాని వస్తుందనగానే స్వాగతించానని అన్నారు.

గణేష్ బీపీ పెంచేశారుగా?

త‌న‌పై టీడీపీ అనర్హత పిటిషన్ వేస్తే ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నానని ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఎన్నికలకు వెళ్లడానికి కూడా సిద్దమేనని ఆయ‌న తేల్చిచెప్పారు. విశాఖలో పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని వాసుప‌ల్లి గ‌ణేష్ ప్ర‌క‌టించారు. వచ్చే విశాఖ మేయర్ ఎన్నికల్లో నూరు శాతం సీట్లు గెలిపించుకునేలా కృషి చేసి జగన్ కు కానుకగా ఇస్తానని అన్నారు.

టీడీపీకి బొక్కే

ఓ వైపు ఎమ్మెల్యేను వ‌దులుకున్న టీడీపీ మ‌రోవైపు వాసుప‌ల్లి గ‌ణేష్ చేసిన వ్యాఖ్య‌ల‌ను జీర్ణించుకోలేక పోతోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. త‌న‌పై టీడీపీ అనర్హత పిటిషన్ వేస్తే ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నానని ఎన్నికలకు వెళ్లడానికి కూడా సిద్దమేనని ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ ప్ర‌క‌టించ‌డం విశాఖ‌లో టీడీపీ ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంద‌ని ప‌లువురు చెప్తున్నారు. మ‌రోవైపు వైసీపీని విశాఖ‌లో బ‌లోపేతం చేస్తాన‌ని ప్ర‌క‌టించిన వాసుప‌ల్లి రాబోయే ఎన్నిక‌ల్లో విశాఖ‌లో మేయ‌ర్ సీటు వైసీపీ కైవ‌సం చేసుకునేలా కృషి చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం తెలుగుదేశం పార్టీకి షాక్ వంటిదంటున‌నారు. గ‌తంలో టీడీపీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న వాసుప‌ల్లి నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కంతో పెద్ద ఎత్తున టీడీపీ నేత‌లు వైసీపీలో చేర‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే ఆయ‌న కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని చెప్తున్నారు.

author avatar
sridhar

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju