NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

సో… ఈ సర్వే ప్రకారం విశాఖ జగన్ చేతిలో ఉందన్నమాట..!

Visakha Politics ; Ganta And Avanthi in Political Trouble

 

(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

తెలంగాణలో అందరి చూప గ్రేటర్ హైదరబాద్ మున్సిపల్ ఎన్నికల వైపు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో అందరి చూపు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై ఉంది. వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన విషయం తెలిసిందే. గడచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఫ్యాన్ గాలి బలంగా వీచినప్పటికీ విశాఖ పట్టణంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ కైవశం చేసుకున్నది. దీంతో పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖలో టీడీపీ అడ్రస్ గల్లంతు చేయాలన్న తలంపుతో  వైసీపీ అక్కడి టీడీపీ ఎమ్మెల్యేలకు గాలం వేసే ప్రక్రియను ప్రారంభించింది. ఒక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ బాబు వైసీపీ పంచన చేరగా మాజీ మంత్రి, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీ గూటికి చేరేందుకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందా అన్నట్లు కాలికి చెప్పులు తొడుక్కొని రెడిగా ఉన్నారు. ఈ సారి జరగబోయే ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలన్న కృత నిశ్చయంతో వైసీపీ ఉన్నది. ఇటీవల టీడీపీ నుండి వైసీపీ పంచన చేరిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ బాబు ఇదే విషయాన్ని చెప్పారు. విశాఖ నగర మేయర్ స్థానాన్ని జగన్‌కు గిఫ్ట్ గా ఇస్తామని అయన అన్నారు.

Visakha Politics ; Ganta And Avanthi in Political Trouble

ఇప్పటికిప్పుడు గ్రేటర్ విశాఖ ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? అనే దానిపై వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వారికి ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడి అయ్యాయట. ఈ సర్వే ఫలితాలు అలా ఉంచితే వైఎస్ఆర్ సీపీకి మాత్రం ఇది జోష్ ఇస్తోంది.

TDP Janasena: CM Seat offer for Pavan Kalyan.. is it True..!?

ఆ సంస్థ సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే..

వైఎస్ఆర్ సీపీకి 49.8 శాతం ఓట్ల షేర్‌తో 84 నుండి 89 సీట్లు కైవశం చేసుకునే అవకాశం ఉందని, టీడీపీ 36.5 శాతం ఓట్ల షేర్‌తో 8 నుండి 14 సీట్లు, ఇండిపెండెంట్‌లు, ఇతరులు 5.1 శాతం ఓట్ల షేర్‌తో సున్నా నుండి ఒకటి సీట్లు వస్తాయని లెక్కలేసింది. జనసేనకు 4.1 శాతం. బీజెపీకి 2.8 శాతం, కాంగ్రెస్ పార్టీకి 1.7 శాతం ఓట్లు వస్తాయని ఆ సంస్థ పేర్కొన్నది. మొత్తం 98 స్థానాలు ఉన్న విశాఖ నగర పాలక సంస్థలో 84 నుండి 89 స్థానాలు వైఎస్ఆర్ సీపీ కైవశం చేసుకుని స్వీప్ చేస్తుందని వెల్లడించింది. టీడీపీ కేవలం 8 నుండి 14 సీట్లు మాత్రమే కైవశం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. జనసేన, బీజేపి, కాంగ్రెస్ పార్టీలు బోణి కూడా కొట్టే పరిస్థితి లేదన్నట్లు ఆ సంస్థ సర్వే ఫలితాలు ఉన్నాయి. సో..విశాఖలో అధికార పార్టీ.. రాజధాని మంత్రం పనిచేస్తుందన్న మాట.

https://twitter.com/vdpa_research/status/1316345694630731777

author avatar
Special Bureau

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!