తల్లిదండ్రుల చెంతకు వీరేష్

58 views

 

తిరుపతి, జనవరి1: తిరుమలలో కిడ్నపయిన బాలుడు వీరేష్ కథ సుఖాంతమైంది. మహారాష్ట్రలో కిడ్నాపర్‌ను అరెస్టు చేసిన పోలీసులు బాలుడిని రక్షించి తిరుపతి తీసుకొచ్చారు.  చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్ తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కూలీ విశ్వంభర్ గా గుర్తించారు. ఇతను గతంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో క్వారీల్లో పని చేశాడని పోలీసులు తెలిపారు. విశ్వంభర్ అవివాహితుడనీ, పెంచుకోవడానికి బాలుడిని ఎత్తుకువెళ్లినట్లు చెబుతున్నాడనీ పోలీసులు పేర్కొన్నారు.

తిరుపతికి వచ్చే భక్తులు తమ పిల్లల విషయంలో జాగ్రతగా ఉండాలని చిత్తూరు ఎస్పీ రాజన్ పేర్కొన్నారు. పోలీసు శాఖ కూడా పిల్లల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నదనీ, ఇకపై తిరుమలకు వచ్చే చిన్నారులకు ట్యాగింగ్ చేస్తామనీ తెలిపారు.