NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

మోడీ స‌ర్కారుకు షాకిచ్చిన వీర్రాజు … ఏం జ‌రిగిందో తెలుసా?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న సంగ‌తి తెలిసిందే. అధికారం కైవ‌సం చేసుకునేందుకు కూడా ప్ర‌య‌త్నిస్తోంది. ఇందుకోసం ఇద్ద‌రు కొత్త అధ్య‌క్షుల‌ను సైతం ప్ర‌క‌టించింది.

ఏపీకి సోము వీర్రాజు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న బీజేపీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం వైఖ‌రికి భిన్న‌మైన ప్ర‌క‌ట‌న చేశార‌ని అంటున్నారు.

అమ‌రావ‌తి గురించి వీర్రాజు ఏమంటున్నారంటే…

ఏపీలో హాట్ టాపిక్ అంశాల్లో అమ‌రావ‌తి ఒక‌టి. రాష్ట్రం విడిపోయిన అనంత‌రం అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు భారీ ఎత్తున భూములు సేకరించి నవ్యాంధ్రకు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అక్కడ తాత్కాలిక భవనాలు కూడా నిర్మించి పాలన ప్రారంభించారు. అయితే, ఏపీలో అధికార మార్పిడి జరిగిన తర్వాత అమ‌రావ‌తి బ‌దులుగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. దీనిపై అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. కేంద్రం జోక్యం చేసుకోవాలనే డిమాండ్ కూడా ఉంది. ఈ డిమాండ్‌పై కేంద్రం ఇప్ప‌టికే క్లారిటీ ఇవ్వ‌గా తాజాగా ఏపీ బీజేపీ ఛీఫ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

వీర్రాజు గారి మాట విన్నారా?

గుంటూరు జిల్లా తుళ్లూరులో ‘భారతీయ కిసాన్ సంఘ్’ రైతుల సమ్మేళనంలో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ సందర్భంగా ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధిగా చెబుతున్నా.. ఏపీ రాజధాని అమరావతియే అని ప్ర‌క‌టించారు. అమరావతిలోనే రాజధాని ఉండాలి అనేది బీజేపీ లక్ష్యం.. ఇందులో రెండో అంశానికి తావు లేదని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్‌ మూడు రాజధానులు నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న సోము వీర్రాజు అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ ఉద్యమం చేస్తుందని సోము వీర్రాజు ప్ర‌క‌టించారు.

మాట త‌ప్పం … మడ‌మ తిప్పం

ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి వైపే ఉన్నారనడానికి అనేక నిద‌ర్శ‌నాలు ఉన్నాయ‌ని సోము వీర్రాజు అన్నారు. ఏపీ బీజేపీ కార్యాలయం విజయవాడలోనే కడుతున్నామని తెలిపారు. రూ. 1800 కోట్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆగిందా?. దుర్గమ్మ ఫ్లై ఓవర్ పూర్తీ చేసామా లేదా? అంటూ వీర్రాజు ప్ర‌శ్నించారు. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి అధికారం ఇస్తే.. అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రకటించారు . తాను మోడీ ప్రతినిధిగానే మాట్లాడుతున్నాన‌ని వైఎస్‌ జగన్ వ‌లే బీజేపీ మాట తప్పదన్న ఆయన.. మడమ తిప్పం. బీజేపీ మాట తప్పే పార్టీకాదని స్పష్టం చేశారు. అయితే, ఇప్ప‌టికే రాష్ట్ర రాజ‌ధాని ఎక్క‌డ ఉండాలో , ఎలా ఉండాలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇష్ట‌మేన‌ని , తాము జోక్యం చేసుకోబోమ‌ని కేంద్రం ప‌లు ద‌ఫాలుగా కోర్టుల్లో అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి మోడీ ప్ర‌తినిధిగా చెప్తున్నాన‌ని పేర్కొన్న వీర్రాజు ఈ విష‌యం ఎందుకు మ‌రిచార‌ని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.

author avatar
sridhar

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?