Venkatesh: టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేసే స్టార్ హీరోలలో వెంకటేశ్ ఒకరు. కానీ ప్రస్తుతం ఆయనొక్కడే చేతిలో కొత్త ప్రాజెక్ట్ లేకుండా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు. ఇక గాడ్ ఫాదర్ షూటింగ్‌తో పాటు భోళా శంకర్, బాబీ సినిమాలను మొదలుపెడుతున్నారు. ఇలా ఆయన చాలా బిజీగా ఉన్నారు. నాగార్జున బంగార్రాజు సినిమాతో పాటు ప్రవీణ్ సత్తారు సినిమా చేతిలో ఉన్నాయి. ఇక బాలయ్య అఖండ సినిమాను పూర్తి చేసి ఇటీవలే క్రాక్ సినిమాతో ఫాంలోకి వచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టారు.
అలాగే యంగ్ హీరోలందరూ మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది వెంకటేశ్ నారప్ప సినిమాతో వచ్చి హిట్ అందుకున్నారు. నవంబర్ 25న దృశ్యం 2 సినిమాతో రాబోతున్నారు. ఇక వరుణ్ తేజ్‌తో కలిసి చేస్తున్న ఎఫ్ 3 వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన వెంకీ తన అన్న కొడుకు రానాతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ చేస్తున్నారు. అంతే తప్ప కొత్తగా సైన్ చేసిన ప్రాజెక్ట్ ఏంటీ..దర్శకుడెవరు అనే విషయాలలో వెంకటేశ్ నుంచి క్లారిటీ రావడం లేదు.
Venkatesh: ఈ ఇద్దరి దర్శకులతో వెంకీ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు లేవని అర్థమవుతోంది.
నారప్ప సినిమా రిలీజ్‌కు ముందు పెళ్ళి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వెంకీ నెక్స్ట్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. తేజ దర్శకత్వంలో కూడా వెంకటేశ్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. అలాగే మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైల్ స్టోన్ మూవీ 75వ సినిమా ఉంటుందని బాగానే ప్రచారం జరిగింది. కానీ తేజ దగ్గుబాటి అభిరాం ను హీరోగా పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ ఇప్పటికే మహేశ్ బాబు సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. కాబట్టి ఈ ఇద్దరి దర్శకులతో వెంకీ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు లేవని అర్థమవుతోంది. ఈ లెక్కన చూస్తే ఇంకా వెంకటేశ్ కొత్త ప్రాజెక్ట్‌ను కమిటయ్యాడా లేదా అనేది క్లారిటీ లేదు.