Narappa Trailer Review: తమిళ మూవీ ‘అసురన్’కి రీమేక్ గా తెలుగులో వస్తున్న నారప్ప సినిమా ట్రైలర్ కొద్ది గంటల ముందు రిలీజ్ అయింది. తమిళంలో ధనుష్ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాలో తెలుగులో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 20 వ తారీకున ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా .. గత చిత్రాలకు భిన్నంగా .. శ్రీకాంత్ అడ్డాల హై ఎమోషనల్ ఎలివేషన్.. యాక్షన్ చిత్రంగా ఈ సినిమా.. తెరకెక్కించడం జరిగింది.
ట్రైలర్ బట్టి చూస్తే అప్పట్లో జయం మనదేరా సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ చేసిన మాదిరిగా ‘నారప్ప’ లో వెంకటేష్ హావభావాలు ఉన్నాయి. ముఖ్యంగా పేరున్న ధనిక కుటుంబాల తో ఒక పల్లెకు చెందిన నాయకుడిగా వెంకటేష్ ప్రియమణి .. పాత్రలు డిజైన్ చేసినట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్లో వెంకటేష్ పలికినా ఓ డైలాగ్ .. చాలా హైలెట్ గా ఉంది. ‘వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ అంటూ వెంకటేష్ పలకడం జరిగింది.
Read More: Narappa Trailer: వెంకీ మామ నారప్ప ట్రైలర్ వచ్చేసింది..!!
అదే రీతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా పాత సినిమాల మాదిరిగా సినిమాలో భారీగానే యాక్షన్ సన్నివేశాలు శ్రీకాంత్ అడ్డాల చిత్రీకరించినట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. సినిమాలో ప్రధాన పాత్రలో ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్ రత్నం నటిస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే చాలా సినిమాల్లో డీల్ చేసే డైరెక్టర్ గా పేరొందిన శ్రీకాంత్ అడ్డాల ఫస్ట్ టైం .. ఒక హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశం స్క్రిప్ట్ కలిగిన సినిమా ని డీల్ చేసినట్టు .. కొత్త తరహాలో ప్రయోగం చేసి పాత వెంకటేష్ ని సిల్వర్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి రెడీ అయినట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఫస్ట్ టైం వెంకటేష్ సినిమా ఓటిటి లో రిలీజ్ అవుతుండటంతో.. అభిమానులు రిలీజ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.